Site icon HashtagU Telugu

Nato Shock :ఉక్రెయిన్ కు నాటో షాక్.. కూటమిలో సభ్యత్వంపై నో క్లారిటీ

Zelensky

Zelensky

Nato Shock :  రష్యా నుంచి తనను కాపాడుకునేందుకుగానూ నాటో దేశాల కూటమి సభ్యత్వం కోసం ట్రై చేస్తున్న ఉక్రెయిన్ కు ఎదురుదెబ్బ తగిలింది.. ఉక్రెయిన్ కు నాటో కూటమి షాక్ ఇచ్చింది.. లిథువేనియా రాజధాని విల్నియస్‌లో జరుగుతున్న నాటో కూటమి సదస్సు వేదికగా ఒక ప్రకటన వెలువడింది..ఎప్పటిలోగా ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇచ్చేది ఇప్పుడే చెప్పలేమని నాటో కూటమి(Nato Shock) తేల్చి చెప్పింది.  అయితే త్వరగా సభ్యత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. దీంతో తమకు నాటో సభ్యత్వం ఎప్పటిలోగా ఇస్తారో క్లారిటీ ఇవ్వండి అని అడుగుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి షాక్ తగిలినట్టయింది.  ఈనేపథ్యంలో నాటో కూటమి సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన జెలెన్ స్కీ ఘాటుగా స్పందించారు.  తమకు నాటో సభ్యత్వం ఇవ్వాలనే ఇంట్రెస్ట్ నాటో కూటమిలో కనిపించడం లేదని  ఆయన వ్యాఖ్యానించారు. కనీసం ఎప్పటిలోగా సభ్యత్వం ఇస్తారో కూడా చెప్పకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. “నాటో ఉక్రెయిన్ కు రష్యా నుంచి భద్రతను ఇస్తుంది. నాటో  కూటమిని ఉక్రెయిన్ బలోపేతం చేస్తుంది” అని గతంలో చాలాసార్లు జెలెన్ స్కీ అన్నారు.

Also read : Trinamool Clean Sweep : దీదీ పార్టీ క్లీన్ స్వీప్.. బెంగాల్ లోకల్ పోల్స్ లో హవా

ఇటీవల రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ అమెరికా పర్యటనకు వెళ్లి వచ్చారు. ఆయన ఒత్తిడి చేయడం వల్లే ఉక్రెయిన్ కు నాటో సభ్యత్వం ఇచ్చే విషయంలో అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి వెనక్కి తగ్గిందని అంటున్నారు.  మరోవైపు ఉక్రెయిన్ కు అమెరికా క్లస్టర్ బాంబుల సప్లై పై రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఘాటుగా  స్పందించారు.  “వివాదాస్పద క్లస్టర్ బాంబులను అమెరికా సరఫరా చేస్తే.. మేం కూడా ఉక్రెయిన్ పై అలాంటి ఆయుధాలను ఉపయోగించాల్సి వస్తుంది” అని వార్నింగ్ ఇచ్చారు. 100 కంటే ఎక్కువ దేశాలు నిషేధించిన క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్ కు అమెరికా సరఫరా చేస్తుండటంపై విచారం వ్యక్తం చేశారు.