Site icon HashtagU Telugu

Handball: హైదరాబాద్‌లో జాతీయ హ్యాండ్‌బాల్‌ పోటీలు

handball

handball

హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ మహిళల హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షిప్‌న‌కు హైదరాబాద్‌ వేదిక కానుంది. వచ్చే మార్చి 29 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరగనున్న ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన దాదాపు 30 జట్లు పాల్గొనే అవకాశముందని జాతీయ హ్యాండ్‌బాల్‌ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్‌ మోహన్‌రావు వెల్లడించారు. పోటీల్లో ఆడే జట్లు వచ్చే నెల 25 లోపు జాతీయ లేదా తెలంగాణ హ్యాండ్‌బాల్‌ సంఘానికి సమాచారం అందించాలని సూచించారు.

సరూర్‌నగర్‌ స్టేడియం, ఎల్బీ నగర్‌లోని అక్షర ఇంటర్నేషనల్‌ స్కూల్‌ పోటీలకు ఆతిథ్యమివనున్నాయని తెలిపారు. పోటీలకు విచ్చేయనున్న జట్లన్నింటికి ఉచిత వసతి, భోజన, రవాణ సదుపాయం కల్పించనున్నామని చెప్పారు. ప్లేయర్లు, వారి వెంట వచ్చే కోచింగ్‌ సిబ్బందికి విధిగా కోవిడ్‌ పరీక్షలు నిర్వహించనున్నామని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా మార్గదర్శకాలు మేరకు కొవిడ్‌ నిబంధనలను రాజీపడకుండా పాటిస్తూ టోర్నీని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జగన్‌ మోహన్‌రావు చెప్పారు.

Exit mobile version