Republic Day Celebrations: గణతంత్ర దినోత్సవ వేడుకలకు (Republic Day Celebrations) దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబౌతుంది. ఈసారి స్వర్ణిం భారత్ వికసిత్ ఔర్ విరాసత్.. (బంగారు భారతదేశం… వారసత్వం పురోగతి) అనే థీమ్ తో అందరినీ ఈ వేడుకల్లో భాగస్వాములను చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించాలని భారత ప్రభుత్వం భావించింది. దాంట్లో భాగంగా కర్తవ్య పత్ లో ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేసింది. 77,000 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీతో ఏర్పాట్లు చేశారు.
గణతంత్ర దినోత్సవ వేడుకులకు కేంద్ర ప్రభుత్వం ఐదంచెల భద్రతను ఏర్పాటు చేసింది. 70 వేల మంది భద్రత సిబ్బంది భద్రత విధులు నిర్వహిస్తున్నారు. అత్యంత భద్రత నిఘా మధ్య ఈ వేడుకలు జరగనున్నాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుభయాంటో హాజరు కానున్నారు. ఇండోనేషియా అధ్యక్షుడుతో పాటు 350 పరేడ్ లో ప్రదర్శన ఇచ్చేందుకు ఇండోనేషియా నుంచి ఇండియాకు రాబోతున్నారు. భారత్ కు చెందిన పది వేల మందిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది.
Also Read:Ola Uber : ఐఫోన్లలో ఒక ఛార్జీ.. ఆండ్రాయిడ్ ఫోన్లలో మరో ఛార్జీ.. ఉబెర్, ఓలాలకు నోటీసులు
వివిధ రంగాల్లో నైపుణ్యం, ప్రతిభ కనబరిచిన వారికి.. వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణ, వైద్యం, పారా ఒలంపిక్ క్రీడల్లో విజేతలకు ఆహ్వానం పలికింది. గణతంత్ర దినోత్సవ పరెడ్ లో 31 శకటాలు ప్రదర్శనకు సిద్ధమయ్యాయి. రాష్ట్రపతి భవన్ నుంచి కర్తవ్య పథ్, ఇండియా గేట్ మీదుగా వెళ్లి రెడ్ ఫోర్ట్ వద్ద పరెడ్ ముగుస్తుంది. 16 రాష్ట్రాలు, 15 కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన శకటాలు సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు తెలియచేసే విధంగా ప్రదర్శన ఉండబోతోంది.
ఆంధ్రప్రదేశ్ నుంచి ఏటికొప్పాక బొమ్మలతో కూడిన శకటం ప్రదర్శనకు ఎంపికైంది. తెలంగాణ శకటం పరేడ్ కు ఎంపిక కానప్పటికి రెడ్ పోర్ట్ లో ఏర్పాటు చేసిన భారత్ పర్వకు ఎంపికైంది. కవాతులో సాయుధ దళాలు, పారా మిలిటరీ బలగాలు, సహాయక పౌర బలగాలు, ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విభాగాలు పాల్గొంటాయి. రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దానికి గుర్తుగా రెండు ప్రత్యేక శకటాలను కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించనుంది. 47 విమానాలతో అద్భుతమైన ఫ్లైఫ్ ఫాస్ట్ తో కార్యక్రమం ముగుస్తుంది.