Site icon HashtagU Telugu

Donut On Mars : అంగారక గ్రహంపై “వడ”.. ఫోటో తీసి పంపిన నాసా రోవర్

Donut On Mars

Donut On Mars

Donut On Mars : ఆశ ..దోశ.. అప్పడం.. “వడ” .. 

ఔను.. ఇటీవల వడ ఆకారంలో ఉన్న ఒక బండరాయిని అంగారక గ్రహం (మార్స్)పై నాసా గుర్తించింది. 

అంగారక గ్రహంపై  రీసెర్చ్ చేస్తున్న నాసా రోవర్ పర్సివరెన్స్ (Perseverance) దీనికి సంబంధించిన ఒక ఫోటోను జూన్ 22న భూమికి పంపింది. అంగారక గ్రహంపై ఉన్న జెజీరో క్రేటర్ కు సంబంధించిన ఫోటోలను నాసా రోవర్ తీసే క్రమంలో సుమారు 328 అడుగుల (100 మీటర్లు) దూరంలో వడ ఆకారంలో ఉన్న రాయి(Donut On Mars) తారసపడింది. దీంతో వెంటనే తన కెమెరాలో బంధించింది. అంగారక గ్రహంపైకి నాసా రోవర్ పర్సివరెన్స్ అడుగుపెట్టి ఇప్పటికే 840 రోజులు పూర్తయ్యాయి.

Also read : Bill Gates Office : పోర్న్ చూస్తావా.. వివాహేతర సంబంధం ఉందా.. ఆ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్నలట : వాల్ స్ట్రీట్ జర్నల్

ఈ రోవర్ లో ఉన్న సూపర్‌క్యామ్‌ ను అమెరికాలోని  న్యూ మెక్సికోలోని లాస్ అలమోస్ నేషనల్ లాబొరేటరీ డెవలప్ చేసింది. మార్స్ ఉపరితలంపై ఏవైనా సూక్ష్మజీవులు ఉన్నా ఫోటోలు తీయగలిగేలా దీన్ని తయారు చేశారు. రాళ్ళ నమూనాలు, దుమ్మూ, ధూళి ఫోటోలను కూడా ఈ కెమెరా క్లియర్ కట్ గా కనిపించేలా తీసి పంపుతుంది. తద్వారా అంగారకుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితలం స్థితిగతులపై శాస్త్రవేత్తలు స్టడీ చేస్తారు.