Mars Image: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోన్న మార్స్ క్రేటర్ ఫోటోలు..!!

ఏలియన్స్...ఈ పేరు వినగానే ప్రపంచంలో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రహాంతర వాసుల గురించి ఏ చిన్న క్లూ దొరికినా అంతే ఆసక్తి రేపుతోంది.

  • Written By:
  • Publish Date - April 17, 2022 / 11:13 PM IST

ఏలియన్స్…ఈ పేరు వినగానే ప్రపంచంలో అంతులేని ఉత్కంఠ కనిపిస్తోంది. గ్రహాంతర వాసుల గురించి ఏ చిన్న క్లూ దొరికినా అంతే ఆసక్తి రేపుతోంది. ప్రధానంగా అమెరికా స్పేస్ కమాండ్ సెంటర్ నాసా ఈ పరిశోధనల్లో ముందుంటుంది. ఏలియన్స్ ఉన్నాయని…అవి మనలాగే మరిన్ని గ్రహాలు జీవకోటికి ఆవాలమనీ కూడా నాసా బలంగా నమ్ముతోంది. దీనికి రాత్రీ పగలు తేడా లేకుండా ఎన్నో పరిశోధనలు చేస్తోంది. ఈ మధ్యే ఇదే నాసా సైంటిస్టులు ఏలియన్స్ ఉనికిపై ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఏలియన్స్ ఉన్నాయనడానికి ఇదో ఎవిడెన్స్ కావచ్చంటూ ..ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇంకేముందు మళ్లీ ఏలియన్స్ పై ప్రపంచంలో పెద్దెత్తున చర్చ మొదలైంది.

నాసా విడుదల చేసిన మార్స్ క్రేటర్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మార్స్ …రికనైసెన్స్ ఆర్బిటర్ లో హై రిజల్యూషన్ ఇమేజింగ్ సైన్స్ ఎక్స్ పెరిమెంట్ (HiRISE)ని ఉపయోగించి స్పేస్ ఏజెన్సీ ఈ చిత్రాన్ని బంధించింది. ఈ ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో మార్టిన్ క్రేటర్ స్పాట్ ను సూచిస్తుంది అంటూ నాసా రాసింది. పిక్సెల్ కు 50 సెంటీమీటర్లలో ఉందనే క్యాప్షన్ కూడా ఇచ్చింది నాసా.

నాసా షేర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన పోస్టుపై పలువురు నెటిజన్లు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. మార్స్ పై గ్రహంతరవాసుల పాదముద్రలు కనిపిస్తున్నాయని ఓ నెటిజన్ కామెంట్ చేయగా…దేవుని స్రుష్టి అంతా ఆవరించి ఉంటుంది…విశ్వం మినహాయింపు కాదని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మాటలు రాకుండా చేసే ఏదో అద్భుతం ఉంది అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక నాసా ఏలియన్స్ ఉన్నాయన్న దానికి త్వరలోనే ఆధారాలు సేకరిస్తామన్న ధీమా వ్యక్తం చేస్తోంది. మొత్తంగా నాసా ఏలియన్స్ ప్రకటనతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో కనిపిస్తోంది.