Site icon HashtagU Telugu

AP Bus Fire: ఆర్టీసీలో బస్సులో చెలరేగిన మంటలు.. 60 మందికి తప్పిన ప్రమాదం!

Fire Accident

Fire Accident

శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగడంతో కనీసం 60 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కృష్ణా జిల్లా వెంట్రప్రగడ సమీపంలో శుక్రవారం ఉదయం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్‌టీసీ)కి చెందిన బస్సు విద్యార్థులతో సహా 60 మంది ప్రయాణికులతో గుడివాడ నుంచి విజయవాడకు వెళ్తోంది. బస్సు ఇంజిన్ నుంచి మంటలు చెలరేగాయి. పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని ఆపి ప్రయాణికులను కిందకు దించాలని కోరారు. బస్సు మొత్తం మంటలు వ్యాపించకముందే ప్రయాణికులంతా సురక్షితంగా దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగిన ద్రుష్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.