Site icon HashtagU Telugu

Pulwama Terror Attack: పుల్వామా ఉగ్రదాడి అమర వీరుల‌కు ప్ర‌ధాని మోదీ నివాళులు

Pulwama Attack Narendra Modi

Pulwama Attack Narendra Modi

పుల్వామా అమరవీరులకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రేమికుల దినోత్సవం రోజున, భార‌త్ జ‌వాన్ల పై పాక్ ముష్క‌రులు ఉగ్రదాడికి పాల్పడిన సంగ‌తి తెలిసిందే. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ నుంచి భార‌త‌ సైనికులు వెళుతుండగా, పాక్‌కు చెందిన జైషే మహమ్మద్‌ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భార‌త‌ జవాన్లు మృతి చెందారు. ఈ పుల్వామా దాడి ఘ‌ట‌న జ‌రిగి నేటితో మూడేళ్లు పూర్తయ్యాయి.

ఈ క్ర‌మంలో నాటి ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు దేశమంతా అశ్రునివాళులు అర్పిస్తోంది. ఇక పుల్వామా దాడిలో అమరులైన జవాన్లకు ప్ర‌తీక‌గా ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ  నివాళులర్పించారు. ఈ క్ర‌మంలో మోదీ మాట్లాడుతూ దేశానికి వారు అందించిన విశిష్ఠ సేవలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామన్నారు. జవాన్ల ధైర్యసాహసాలు ఎప్పటికీ భారతీయులకు స్ఫూర్తిగా నిలుస్తాయంటూ జ‌వాన్ల‌కు మోదీ నివాళి అర్పించారు. ఇక‌పోతే పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ నిర్వహించి గుణ‌పాఠం చెప్పిన సంగ‌తి తెలిసిందే.