Site icon HashtagU Telugu

Ukraine Russia War: పుతిన్‌కు మోదీ ఫోన్.. ఇంత‌కీ ఏం చెప్పారంటే..?

Vladimir Putin Narendra Modi

Vladimir Putin Narendra Modi

రష్యా, ఉక్రెయిన్ దేశాల‌ మధ్య భీకర యుద్ధం సాగుతోంది. ఉక్రెయిన్, ర‌ష్యాల మధ్య యుద్ధం ప్రారంభమైన నేప‌ధ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కల్పించుకుని, రష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పోన్‌లో మాట్లాడారనే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో హింస‌ను వ‌దిలేయాల‌ని పుతిన్‌కు మోదీ సూచించార‌ని తెలుస్తోంది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన ద్వారా వెల్ల‌డించింది.

ఇక హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని, చర్చల ద్వారా స‌మ‌స్య‌ల‌కు పరిష్కార మార్గాలను అన్వేషించాలని మోదీ సూచించారు. అలాగే ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మోదీకి పుతిన్ వివరించారని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో నాటో దేశాలు, రష్యాల మధ్య విభేదాలను చర్చల ద్వారానే పరిష్క‌రించుకోవాలని న‌రేంద్ర మోదీ పుతిన్‌కు సూచించారు. ఇక‌పోతే ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను సురక్షితంగా ఇండియాకు తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Exit mobile version