Site icon HashtagU Telugu

BRS Minister: నరేందర్ రెడ్డి గెలుపు రెండోసారి ఖాయం: మహేందర్ రెడ్డి

Patnam-Mahender-Reddy

Patnam-Mahender-Reddy

BRS Minister: కొడంగల్ మండల టిఆర్ఎస్ పార్టీ బూత్ కమిటీ సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి తో పాటు, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, పరిశీలకుడు నరసింహారావు పాల్గొన్నారు. గుడిమేశ్వరం అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు లలిత వెంకటేష్ కూతురు స్మైలీ మూడో బర్త్డే కేక్ కట్ చేసి మంత్రి మహేందర్ రెడ్డికి తినిపించారు. అనంతరం బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పని అయిపోయింది.. బిజెపికి క్యాడర్ లేదు అని, ఓటర్లు కర్ణాటకలో కాంగ్రెస్ కు ఓటు వేస్తే ఏం జరిగిందో తెలుసుకోవాలని ఆయన అన్నారు.

‘‘పథకాలను అందించే కెసిఆర్ ప్రభుత్వం కావాలా… ప్రజల్లో తిరిగే నరేందర్ రెడ్డి కావాలా… 70 ఏళ్లు ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ కావాలా.. పదేళ్లు కొడంగల్ లో ఒక్క ఊరు తిరగని రేవంత్ రెడ్డి కావాలా ఆలోచించుకోవాలి. ఎవరు ఎన్ని చెప్పినా మూడోసారి కెసిఆర్ సీఎంగా, కొడంగల్ లో రెండోసారి ఎమ్మెల్యేగా నరేందర్ రెడ్డి గెలవడం ఖాయం’’ మహేందర్ రెడ్డి అన్నారు.