Drugs In Kerala : కేర‌ళ‌లో భారీగా ప‌ట్టుబ‌డ్డ హెరాయిన్‌.. దాని విలువ ఎంతంటే..?

దేశంలో విచ్చ‌ల‌విడిగా మాద‌క‌ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. అధికారులు ఎన్ని త‌నిఖీలు చేసిన స‌ర‌ఫ‌రా మాత్రం అగ‌డం...

  • Written By:
  • Updated On - October 8, 2022 / 07:25 AM IST

దేశంలో విచ్చ‌ల‌విడిగా మాద‌క‌ద్ర‌వ్యాలు స‌ర‌ఫ‌రా అవుతున్నాయి. అధికారులు ఎన్ని త‌నిఖీలు చేసిన స‌ర‌ఫ‌రా మాత్రం అగ‌డం లేదు. డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసే కేటుగాళ్లు వివిధ రూపాల్లో వాటిని త‌ర‌లిస్తున్నారు. తాజాగా కేర‌ళ‌లో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డ‌టం అధికార‌ల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో హెరాయిన్ ఎక్క‌డికి స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌నే దానిపై పోలీసులు ఆరా తీశారు. కేరళలోని కొచ్చి తీరంలో రూ.1,200 కోట్లు విలువ చేసే హెరాయిన్ అధికారులు సీజ్ చేశారు. నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌కు చెందిన పడవ నుంచి 200 కిలోల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాగా ఆరుగురు ఇరాన్ దేశస్థులను అరెస్ట్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ డ్రగ్స్ ముందుగా పాకిస్థాన్ వెళ్లాయని, అక్కడ ఇరానియన్ బోటులో ఎక్కించి భారత్ తీసుకొచ్చారని అధికారులు తెలిపారు.