Biggest Ever Drug Raid : వేలకోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

  • Written By:
  • Updated On - June 6, 2023 / 10:40 AM IST

సీక్రెట్ గా దేశవ్యాప్తంగా డ్రగ్స్ అమ్ముతున్న అతిపెద్ద ముఠా గుట్టును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) మంగళవారం  రట్టు చేసింది. ఇప్పటివరకు దేశంలో మునుపెన్నడూ ఇంత భారీగా LSD డ్రగ్స్ పట్టుకోలేదని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ముఠా ఇంటర్నెట్ లో అత్యంత రహస్యమయంగా ఉండే డార్క్ వెబ్ ద్వారా పని చేస్తోందని వెల్లడించాయి. డార్క్ వెబ్ లోనే డ్రగ్స్ ఆర్డర్స్ తీసుకొని.. ఆ తర్వాత ఆయా ప్రాంతాల్లోని తమ రహస్య ఏజెంట్ల ద్వారా సప్లై చేస్తుండేదని అధికారులు చెప్పారు.

Also read : Biggest Ever Drug Raid : వేల కోట్ల డార్క్ వెబ్ డ్రగ్స్ రాకెట్ బట్టబయలు

సైబర్ క్రైమ్ పోలీసులకు, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో  కంటపడకుండా ఉండేందుకు ఈ ముఠా సభ్యులు చాటింగ్స్ కూడా  డార్క్ వెబ్ లోనే చేసేవారని అధికారులు చెప్పారు. ఇందుకోసం ఆ గ్యాంగ్ సభ్యులు  ది ఆనియన్ రౌటర్ (ToR) అనే పేరు కలిగిన రహస్య బ్రౌజింగ్ సాఫ్ట్ వేర్ ను వాడేవారని  వివరించారు. హాలూసినోజెన్‌ కేటగిరిలోకి వచ్చే లైసెర్జిక్ యాసిడ్ డైథైలామైడ్ (LSD)  అనే  సింథటిక్ రసాయన ఆధారిత డ్రగ్  ని ఈ ముఠా సభ్యులు పెద్దఎత్తున సప్లై చేసేవాళ్ళని చెప్పారు. ఇప్పుడు వేల కోట్లు విలువ చేసే ఈ డ్రగ్ నే భారీ పరిమాణంలో పట్టుకున్నామని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు వెల్లడించారు.