Marriage Expense: మీకు తెలుసా..? రూ.800తో పెళ్లి చేసుకున్న దేశంలోని ధనిక జంట..!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరు. అయితే వారు వారి సాధారణ జీవనశైలితో ప్రసిద్ధి చెందారు. తమ పెళ్లికి కేవలం రూ.800 మాత్రమే ఖర్చు చేశామని (Marriage Expense) దంపతులు చెప్పారు.

  • Written By:
  • Updated On - January 6, 2024 / 12:41 PM IST

Marriage Expense: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, ఆయన భార్య సుధా మూర్తి దేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరు. అయితే వారు వారి సాధారణ జీవనశైలితో ప్రసిద్ధి చెందారు. తాజాగా నారాయణ, సుధా మూర్తి ఓ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ పెళ్లికి సంబంధించిన పలు షాకింగ్ సీక్రెట్స్ వెల్లడించారు. తమ పెళ్లికి కేవలం రూ.800 మాత్రమే ఖర్చు చేశామని (Marriage Expense) దంపతులు చెప్పారు. ఇంటర్వ్యూలో సుధా మూర్తి మాట్లాడుతూ.. నేను పెద్ద ఉమ్మడి కుటుంబానికి చెందినది. కుటుంబంలో కేవలం 75 నుండి 80 మంది సభ్యులు ఉండేవారు. అలాంటి పరిస్థితుల్లో సుధా మూర్తి పెళ్లికి 200 నుంచి 300 మంది బంధువులను పిలవాలని ఆమె తండ్రి భావించారు. అయితే సుధా మూర్తి పెళ్లిని గ్రాండ్ గా కాకుండా చాలా సింపుల్ గా చేసుకోవాలనుకున్నారు.

సుధా మూర్తి- నారాయణ మూర్తి 1978 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఆడంబరంగా కాకుండా సాదాసీదా వివాహాన్ని కోరుకున్నారు. ఇందుకోసం పెళ్లికి రూ.800 బడ్జెట్ ఫిక్స్ చేసినా సుధా మూర్తి తండ్రి దీనిపై అసంతృప్తితో ఉన్నారు. కుటుంబానికి చెందిన మొదటి కూతురి పెళ్లి ఇదేనని, అంగరంగ వైభవంగా చేయాలనుకున్నామని, అయితే చివరికి సింపుల్ గా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ జంట బెంగళూరులో సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఏడు సార్లు ప్రదక్షిణలు చేశారు.

Also Read: David Warner: డేవిడ్ వార్నర్‌కు ప్రత్యేక బహుమతిని ఇచ్చిన పాకిస్థాన్.. ఏం గిఫ్ట్ అంటే..?

పెళ్లికి 800 రూపాయలు మాత్రమే ఖర్చు

ఈ వివాహానికి ఇద్దరూ కలిసి మొత్తం రూ.800 ఖర్చు చేశారని, అందులో రూ.400 నారాయణమూర్తి, రూ.400 సుధామూర్తి ఖర్చు చేశారని తెలిపారు. వారిద్దరూ తమ వివాహాన్ని చాలా సింపుల్‌గా చేసుకున్నామన్నారు. నారాయణ్ మూర్తి సుధా మూర్తికి చీర లేదా మంగళసూత్రం ఎంచుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆమె కొత్త మంగళసూత్రాన్ని రూ. 300కి కొనుగోలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో సుధా మూర్తి మాట్లాడుతూ.. పెళ్లి అనేది కేవలం ఒక రోజు బంధం కాదని, అది జీవితాంతం సాగే బంధమని అన్నారు. ఈ పరిస్థితిలో ఎక్కువ డబ్బు ఖర్చు చేయడానికి బదులుగాఒకరిపై ఒకరు ఎక్కువ శ్రద్ధ వహించాలనుకున్నాం అని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేరు ఉంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం.. అతని నికర విలువ 4.4 బిలియన్ డాలర్లు. నారాయణ్, సుధా మూర్తిల మొత్తం సంపద దాదాపు రూ.37,465 కోట్లు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధా మూర్తి.