సినీ నటుడు నందమూరి తారకరత్న మరణంతో యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. నిన్న సాయంత్రం ఈ విషాద వార్త తెలుసుకున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కన్నీటీపర్యంతమైయ్యారు. తనకు చేదోడువాదోడుగా ఉంటూ తనతో తిరుగుతున్న వ్యక్తి ఇలా మృత్యువాత పడటం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీకాళహస్తి క్యాంప్ సైట్‌లో నిన్న విరామంలో ఉన్న ఆయన ఈ వార్త తెలియగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. సన్నిహితులు పార్టీ పెద్దలు ఆయన్ని ఓదార్చారు. తారకరత్న మృతితో ఈ రోజు పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఈ రోజు నారా లోకేష్ హైదరాబాద్ చేరుకోని తారకరత్న భౌతికకాయానికి నివాళ్లు అర్పించనున్నారు. తారకరత్న మృతి ఇటు నందమూరి, అటు నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. గత మూడు వారాలుగా బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న నిన్న రాత్ని తుదిశ్వాస విడిచారు.
Lokesh Nara : యువగళం పాదయాత్రకు విరామం.. నేడు హైదరాబాద్‌కు నారా లోకేష్
సినీ నటుడు నందమూరి తారకరత్న మరణంతో యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది. నిన్న సాయంత్రం ఈ విషాద వార్త

Lokesh Yuva Galam
Last Updated: 19 Feb 2023, 07:29 AM IST