Site icon HashtagU Telugu

TDP : నారా లోకేష్ ..టీడీపీ నేతలను పూర్తి స్థాయిలో సంతృప్తి పరిచినట్లేనా..?

tdp leaders fully satisfied

tdp leaders fully satisfied

టీడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం (Yuvagalam) పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటికి ఈ యాత్ర 190 వ రోజుకు చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా లోకేష్ కష్టపడుతున్నాడు. లోకేష్ పాదయాత్ర అనగానే నవ్వుకున్నా వారంతా..ఇప్పుడు లోకేష్ కష్టపడుతున్న తీరు చూసి..ఎంత కష్టపడుతున్నాడో..ఎలాగైనా ఈసారి ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

లోకేష్ యాత్ర (Nara Lokesh Yuvagalam Padayatra) మొదలుపెట్టి 190 రోజులు అవుతున్న ఇప్పటి వరకు 12 గంటలకు పైగా నిర్విరామంగా పాదయాత్ర చేసిన సందర్భం లేదు. కానీ నిన్న 12 గంటలకు పైగా నిర్విరామంగా పాదయాత్ర చేసి ఆశ్చర్య పరిచారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొనసాగుతుంది. ఈరోజు గన్నవరం నియోజకవర్గంలో దాదాపు16 కిలోమీటర్ల మేర సాగనుంది. నిన్న సాయంత్రం 3 గంటల నుంచి ఈ రోజు తెల్లవారుజామున 3:40గంటల వరకూ అంటే దాదాపు 12 గంటలకు పైగా నిర్విరామంగా 16 కిలోమీటర్ల పాటు లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పాదయాత్ర మొదలు పెట్టిన తర్వాత ఏకధాటిగా 12 గంటల పాటు పాదయాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఓ పక్క భుజం నొప్పితో బాధపడుతున్న లోకేష్ ఏమాత్రం అలిసిపోకుండా అలాగే తన యాత్రను కొనసాగించారు. లోకేష్ అంత నొప్పిని భరిస్తూ ప్రజలకోసం పాదయాత్ర చేస్తుండడం అందర్నీ కలిచివేసింది. ఇప్పటి వరకూ లోకేష్ 2,525 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసారు.

ఇక లోకేష్ యాత్ర(Nara Lokesh Yuvagalam Padayatra)కు ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారు. అడుగడుగునా అభిమానులు , టీడీపీ (TDP) కార్యకర్తలు లోకేష్ కు నీరాజనాలు పలుకుతున్నారు. లోకేష్ సైతం తన యాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుంటూ, వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై నిప్పులు చెరుగుతూ ముందుకు సాగుతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారం లోకి రావడం ఖాయమని , ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని తెలియజేస్తూ..టీడీపీ అధికారంలోకి రాగానే పలు హామీలు నెరవేరుస్తామని హామీ ఇస్తున్నారు. ఇక ఈ పాదయాత్ర తో టీడీపీ శ్రేణులు మరో నాయకుడు లోకేష్ రూపంలో దొరికాడని మాట్లాడుకుంటున్నారు.

2014 ఎన్నికల తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన లోకేష్ తొలుత ఎమ్మెల్సీ అయ్యారు. తరువాత మంత్రి బాధ్యతలు చేపట్టారు. 2019 ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలో దిగి ఓటమి చవిచూశారు. ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు ముందు లోకేష్ లో మైనస్ లే అధికం. వాటన్నింటినీ ఎలా అధిగమిస్తారా అన్న ఆందోళన క్యాడర్ లో ఉండేది. ముఖ్యంగా లోకేష్ కు మాస్ ఇమేజ్ లేదు. నాయకత్వ లక్షణాలు లేవు. అధికారంలో ఉండి.. సిట్టింగ్ మంత్రి అయి ఉండి.. సీఎం తనయుడు అయి ఉండి గత ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. దీంతో ఆయన ఒక నాయకుడే కాదన్న రేంజ్ లో విపక్షం ప్రచారం చేసింది. ఈ తరుణంలో పాదయాత్ర చేసిన ఆయనపై ఒక టాక్ నడిచింది. అసలు లోకేష్ పాదయాత్ర చేయగలరా? మధ్యలో ఆపేస్తారా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ ఇటువంటి వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారు లోకేష్.

రేపు టీడీపీ అధికారంలోకి వస్తే.. చంద్రబాబు (Nara Chandrababu Naidu) పట్టించుకుంటారో లేదో కానీ.. లోకేష్ తమకు అండగా నిలుస్తారని పార్టీ నేతలు (TDP Leaders) భావిస్తున్నారు. అటు పార్టీలో పనిచేస్తున్న నాయకుల వ్యవహార శైలిని సైతం తన పాదయాత్ర ద్వారా లోకేష్ నిఘా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలను సిద్ధం చేస్తూ.. ప్రతి నియోజకవర్గంలో ఇప్పుడున్న నాయకులకు ప్రత్యామ్నాయంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. గతంలో లోకేష్ ను తక్కువ చేసిన సీనియర్ల సైతం.. ముక్కున వేలేసుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. పాదయాత్రలో ఎన్నో అడ్డంకులు వచ్చినా.. సమయస్ఫూర్తితో లోకేష్ ముందుకు వెళ్తున్నారు. అలాగే తన ప్రసంగ శైలి కూడా గతానికి భిన్నంగా ఉంది. గతంలో మాట్లాడేందుకే ఇబ్బంది పడ్డ లోకేష్.. ఇప్పుడు మాటల్లో రాటుదేలారు. ఇలా ఎలా చూసుకున్నా తన నాయకత్వ లక్షణాలను మరింత అభివృద్ధి చేసుకున్నారు లోకేష్. మరి ముందు ముందు ఇంకెలా రాడ్ తేల్తారో చూడాలి.

Read Also : Chandrayaan-3: జాబిల్లిపై ఫోటోలను పంపిన చంద్రయాన్-3…ఫోటోలని విడుదల చేసిన ఇస్రో