Site icon HashtagU Telugu

AP : పవన్ అండగా ఉండగా తానెలా ఒంటరి వాడిని అవుతా – నారా లోకేష్

Lokesh Says Thanks To Pawan Kalyan

Lokesh Says Thanks To Pawan Kalyan

చంద్రబాబు (Chandrababu) ను అరెస్ట్ చేసాం..నెక్స్ట్ లోకేషే అని ఓ పక్క వైసీపీ నేతలు అంటున్నారు..మరోపక్క చంద్రబాబు కు బెయిల్ రాకుండా కుట్ర చేస్తున్నారు. ఓ కేసు నడుస్తుండగానే మరో కేసు పెట్టి..ఇబ్బందికి గురి చేయాలనీ చూస్తున్నారు. ఇలా ఎన్ని చేసిన చివరకు ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు టిడిపి శ్రేణులు. ఈ క్రమంలో నారా లోకేష్ (Nara Lokesh).. రాజమండ్రి జైలు సమీపంలోని విద్యానగర్‌ విడిది కేంద్రం వద్ద మీడియాతో మాట్లాడారు.

చాలా సంక్షోభాలు చూశానని, ఇది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనన్నారు. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందనే వార్తలపై స్పందించారు. కేంద్రం కుట్ర ఉందో లేదో తెలియదన్నారు. తాను పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) ను అన్నగా భావిస్తానని.. పవన్, మమతా బెనర్జీ, ప్రజలు ఈ కష్ట సమయంలో తమకు స్వచ్ఛందంగా అండగా నిలబడ్డారని, వారందరూ ఉండగా తానెలా ఒంటరి వాడిని అవుతానని అన్నారు. అలాగే టీడీపీ తలపెట్టిన బంద్ కు సహకరించిన ప్రజలు, పవన్‌, మంద కృష్ణ మాదిగ, కమ్యూనిష్టులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్రం, దేశం గురించి ఆలోచించే వ్యక్తి చంద్రబాబని, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని లోకేష్ తెలిపారు. బిల్ గేట్స్ ను అడిగినా, బిల్ క్లింటన్ ను అడిగినా చంద్రబాబు ఓ బ్రాండ్ అని చెబుతారన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు ఆరోపణ చేసి జైలుకు పంపిన వ్యక్తి సైకో జగన్ అన్నారు. అందుకే ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో స్పందన వచ్చిందన్నారు.

Read Also : Chandrababu House Remand : చంద్రబాబు హౌస్ రిమాండ్ కేసుఫై తీర్పు వాయిదా వేసిన ఏసీబీ కోర్ట్

‘జగన్ (Jagan ) చేసిన అతి పెద్ద తప్పు చంద్రబాబు అరెస్ట్. పాముకు తలలో విషం ఉంటే జగన్‌కు ఒళ్లంతా విషమే ఉంటుంది. జగన్‌కు అధికారం అంటే ఏమిటో తెలియదు. అధికారం అంటే ప్రజలకు మేలు చేయడం. ఉద్యోగాలు కల్పించడం, అభివృద్ధి చేయడం. కానీ జగన్ దృష్టిలో అధికారం అంటే వేధింపులు, కక్ష తీర్చుకోవడం మాత్రమే. జగన్ రెడ్డిపై 38 కేసులు ఉన్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసు, పింక్ డైమండ్ కేసు, కోడి కత్తి కేసుల్లో ఎంత నిజముందో, చంద్రబాబుపై పెట్టిన కేసులో కూడా అంతే నిజముంది. ఈ కేసుతో జగన్ ఎంత సైకోనో ప్రజలకు తెలిసొచ్చింది’ అని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యువగళం పాదయాత్రను ఆపేస్తున్నా. మా నాయకుడు చంద్రబాబుపై దాడి జరుగుతోంది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా దాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యతనాపై ఉంది. నాయకులు అందరితో సమాలోచనలు జరిపి తిరిగి ఎప్పుడు ప్రారంభించేది చెబుతానన్నారు.