Hello Nara Lokesh : తన లవ్ స్టోరీ ని పబ్లిక్ గా బయటపెట్టిన నారా లోకేష్..

లోకేష్ తన భార్య బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని

Published By: HashtagU Telugu Desk
Nara Lokesh Reveals His Love Story With Nara Brahmani

Nara Lokesh Reveals His Love Story With Nara Brahmani

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh ) గత కొద్దీ నెలలుగా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తూ ప్రజల కష్టనష్టాలను అడిగితెలుసుకుంటూ..టీడీపీ ప్రభుత్వ వస్తే అన్ని సమస్యలను తీరుస్తాం అంటూ భరోసా ఇస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో బుధువారం మంగళగిరి లో ‘హలో లోకేష్’ (Hello Lokesh) పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు , పలు కాలేజీల స్టూడెంట్స్ హాజరయ్యారు. ఇందులో వారు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానం తెలిపారు.

తిరువూరు శ్రీవాహిని కాలేజీ నుంచి వచ్చిన రమ్య అనే విద్యార్థిని నారా లోకేష్‌ పెళ్లి గురించి ప్రశ్న వేసింది. ‘బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదట ఎవరు తీసుకొచ్చారు? (Love Story with Brahmani) ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి?’ అని ప్రశ్నించింది. దానికి ఏమాత్రం ఆలోచించకుండా లోకేష్ తన భార్య బ్రాహ్మణితో తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని తెలిపారు.

‘నాది, బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా. కానీ, ముద్దుల మామయ్య (Balakrishna) దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే’ అంటూ నారా లోకేష్ చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ‘అమ్మా, నాన్న గారితో ఒకసారి వెకేషన్‌కి వెళ్లినప్పుడు.. వాళ్లు నాకు ఈ విషయం గురించి చెప్పారు. ఇట్లా అనుకుంటున్నాం.. నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. ఇక మన అభిప్రాయం ఏంటో తెలుసు కదా. వాళ్లు ప్రతిపాదించారు. ఎస్ అని అనుకున్నాం. బ్రాహ్మణి (Nanadhamuri Brahmani) కూడా ఒప్పుకుంది. రెస్ట్ ఈస్ హిస్టరీ’ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు. లోకేష్ ఈ విషయాలు షేర్ చేసుకునేటప్పుడు యువత అరుపులతో ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయింది.

ఇదే కార్యక్రమంలో మరో విద్యార్థిని మీ ఫస్ట్ క్రష్ (Nara Lokesh First Crush) ఎవరు? అని అడుగగా.. అయితే స్కూలులో, కాలేజీలో చేయాల్సిన వెధవ పనులన్నీ చేశా .. అందరిలాగే తనకు కూడా చాలా క్రష్ లు ఉన్నాయని తెలిపారు. కానీ ఆ పేర్లు చెబితే ఐదు రూపాయల పేటీఎం బ్యాచ్ లు ఈ విషయాలను అనవసరంగా ట్రోల్ చేస్తుందన్నారు. ఒక్క విషయం మాత్రం చెబుతానంటూ.. తనది కాలేజీ లైఫ్ అయితే జగన్ ది జైల్ లైఫ్ అంటూ లోకేష్ సెటైర్లు వేశారు.

Read Also : Kamna Jethmalani : జూనియర్ ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్న కామ్నా..

  Last Updated: 17 Aug 2023, 05:24 AM IST