తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ఏపీ మంత్రిగా ప్రజా సేవలో ముందుండే నారా లోకేష్ (Nara Lokesh ), ప్రజలతో మరింత మమేకమవుతున్నారు. అమెరికాలో ఉన్నత చదువులు చదివి హైఫై కల్చర్ లో ఉన్నప్పటికీ, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తర్వాత తన లక్ష్యాన్ని పూర్తిగా ప్రజా సేవగా మార్చుకున్నారు. టీడీపీ కార్యకర్తలకు బీమా సౌకర్యాన్ని అందించి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన లోకేష్, గడిచిన కొన్నేళ్లుగా అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజలకు మరింత చేరువయ్యారు. విద్య, ఐటీ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ తన నియోజకవర్గం, పార్టీ కార్యకలాపాలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు.
AP Govt : ‘టైలరింగ్ శిక్షణ’ పథకానికి అర్హులెవరెవరు?
తాజాగా తన వద్ద పర్సనల్ అసిస్టెంట్ (పీఏ)గా పనిచేస్తున్న సాంబశివరావు కుమార్తె నిశ్చితార్థ వేడుకకు లోకేశ్ తన సతీమణి నారా బ్రాహ్మణితో కలిసి హాజరయ్యారు. విజయవాడలో జరిగిన ఈ వేడుకలో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించడంతో పాటు, వారి కుటుంబ సభ్యులతో హృదయపూర్వకంగా ముచ్చటించారు. అధికారం బాధ్యతలతో ఎంతో బిజీ గా ఉన్నప్పటికీ, తన వద్ద పనిచేసే వ్యక్తుల జీవిత వేడుకలకు కూడా హాజరయ్యే విధంగా లోకేశ్ ప్రవర్తించడం అందర్నీలో ఆశ్చర్యం కలిగించింది. ఇది నాయకుడిగా ఆయన వ్యక్తిత్వాన్ని మరింత ప్రతిబింబించే అంశమని అంత మాట్లాడుకున్నారు..