Site icon HashtagU Telugu

TDP Donations: టీడీపీకి ‘విరాళాల’ వెల్లువ‌!

Tdp

Tdp

మహానాడు సంద‌ర్భంగా టీడీపీకి విరాళాలు వ‌స్తున్నాయి. అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన పిలుపునకు భారీ స్పందన వచ్చింది. పార్టీకి విరాళాలు ఇవ్వాలని.. కొంత మంది ప్రకటించి, ఇవ్వకుండా ముఖం చాటేస్తున్నారని చంద్రబాబు తెలిపారు. ఈసారి విరాళం ప్రకటించడం కాదని.. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే తగిన గుర్తింపునిస్తానని చంద్రబాబు చేసిన ప్రకటన ఫలితాన్నిచ్చింది. తొలిరోజు మహానాడు సందర్భంగా టీడీపీకి భారీగా విరాళాలు వచ్చాయి. గుంటూరుకు చెందిన పార్టీ నాయకుడు మన్నవ మోహనకృష్ణ రూ.31,60,000 విలువైన తాగునీటి బాటిళ్లు అందించారు. అలాగే గుంటూరుకు చెందిన టీడీపీ నేత కోవెలమూడి రవీంద్ర (గుంటూరు) పార్టీకి అత్యధికంగా రూ.27 లక్షల విరాళం ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, దామచర్ల జనార్దన్‌, ఇంటూరి నాగేశ్వరరావు రూ.25 లక్షలు చొప్పున విరాళాలిచ్చారు.

ఆర్‌.శ్రీనివాసరెడ్డి (కడప), పుట్టా సుధాకర్‌ యాదవ్‌ (మైదుకూరు), గల్లా జయదేవ్‌ (గుంటూరు) రూ. 20 లక్షలు చొప్పున విరాళం అందించారు. బీసీ జనార్ధన్‌ రెడ్డి (బనగానపల్లె), గొట్టిపాటి రవికుమార్‌ (అద్దంకి) రూ.15 లక్షలు అంద‌జేశారు. జీవీ ఆంజనేయులు (వినుకొండ), భాష్యం ప్రవీణ్‌ (గుంటూరు), దామచర్ల సత్య (ఒంగోలు), ఎంఎం.కొండయ్య (చీరాల), పమిడి రమేష్‌ (ఒంగోలు), ఏలూరి సాంబశివరావు (పర్చూరు), శంకర్‌ యాదవ్‌ (తంబళ్లపల్లె) రూ.10 లక్షలు అంద‌జేశారు.

Exit mobile version