Chandrababu Arrest : దుర్గమ్మ సన్నిధానంలో కన్నీరు పెట్టుకున్న నారా భువనేశ్వరి

తన ఒక్కడి కోసం.. ఆయన కుటుంబం కోసం.. పోరాటం చేయడం లేదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారు.. ప్రజలందర్నీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒక్కటే ఆయనకు మద్దతుగా ఉండాలని’

Published By: HashtagU Telugu Desk
Nara Bhuvaneshwari Visit Durga Temple

Nara Bhuvaneshwari Visit Durga Temple

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari )..శనివారం విజయవాడ కనక దుర్గమ్మ (Vijayawada Durga Temple)ను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా చంద్రబాబు (Chandrababu Arrest) అరెస్ట్ ఫై ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బిడ్డకు మనసు బాగులేనప్పుడు తల్లిదండ్రుల వద్దకు వస్తారు… నా భర్తను అరెస్ట్ చేయడంతో నేను కూడా నా బాధను చెప్పుకోడానికి దుర్గమ్మ గుడికి వచ్చానని తెలిపారు. అమ్మవారిని నేను కోరింది ఒక్కటే.. ‘చంద్రబాబు నాయుడికి మనోధైర్యాన్ని ఇవ్వాలని వేడుకున్నాను.

తన ఒక్కడి కోసం.. ఆయన కుటుంబం కోసం.. పోరాటం చేయడం లేదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పోరాడుతున్నారు.. ప్రజలందర్నీ మనస్ఫూర్తిగా నేను కోరుకునేది ఒక్కటే ఆయనకు మద్దతుగా ఉండాలని’ అని అన్నారు. చంద్రబాబు తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం శ్రమిస్తున్నారన్నారు. సీఎం జగన్ మాత్రం ఏపీని వదిలేసి విదేశాల్లో తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని నెంబర్ వన్‌లో నిలుపుదామని పేర్కొన్నారు.

Read Also : 73 Years Young Man : 73 ఏళ్లలోనూ 25 ఏళ్ల యువకుడి ఉత్సాహం.. అలుపెరగని ప్రజా పోరాటయోధుడు చంద్రబాబు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు ను శనివారం ఉదయం నంద్యాల లో సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాల నుండి విజయవాడ కు రోడ్డు మార్గాన తీసుకొస్తున్నారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. రోడ్డు పొడుగూతా పోలీసులను అడ్డుకునేందుకు ట్రై చేసినప్పటికీ…పెద్ద ఎత్తున పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ వెంట వెళ్తూ..ప్రజలను చెదరగొడుతున్నారు.

చిలకలూరిపేట వద్ద చంద్రబాబు కాన్వాయ్ ను ప్రజలు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లనివ్వకుండా రోడ్ ఫై భేటాయించారు. చంద్రబాబు విజ్ఞప్తితో కార్యకర్తలు పక్కకు తప్పుకున్నారు. ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించాలని చంద్రబాబు సూచించారు.

  Last Updated: 09 Sep 2023, 03:40 PM IST