Site icon HashtagU Telugu

Hi Nanna: తండ్రికూతురి సెంటిమెంట్.. హాయ్‌ నాన్న’ నుంచి ‘గాజు బొమ్మ’ సాంగ్‌ ప్రోమో

Nani30

Nani30

Hi Nanna: శౌర్యువ్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. తల్లీ కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావోస్తోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్, గ్లింప్స్ వీడియో సినిమాపై అంచనాలు పెంచేశాయి. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉన్న టీం మరోవైపు ఈసినిమా మ్యూజిక్ ను మొదలుపెట్టేశారు.

ఖుషి కి సూపర్ ఆల్బమ్ ఇచ్చిన హేషమ్ అబ్దుల్ వాహబ్ ఈసినిమాకు మ్యూజిక్ అందిస్తుడటంతో ఈసినిమా పాటలపై కూడా ఇప్పటినుండే ఆసక్తి నెలకొంది. నాని పక్కన మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) జంటగా నటిస్తోంది. తండ్రీకుమార్తెల సెంటిమెంట్‌తో కుటుంబ కథా చిత్రంగా ఇది సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఇటు రావే నా గాజు బొమ్మ’ అంటూ సాగే పాట ప్రోమోను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ప్రోమో మ్యూజిల్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది.