Site icon HashtagU Telugu

Cinema: ఓటీటీ లో ‘శ్యామ్ సింగ రాయ్’

Template (54) Copy

Template (54) Copy

నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ రూపొందించిన ‘శ్యామ్ సింగ రాయ్’ సినిమా క్రితం నెల 24వ తేదీన థియేటర్లకు వచ్చిన విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. 70వ దశకం ప్రధానంగా నడిచే ఈ కథలో నాని సరసన సాయిపల్లవి .. కృతి శెట్టి .. మడోన్నా అలరించారు. ఇక ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ‘నెట్ ఫ్లిక్స్’ తీసుకోగా ఈ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై ఈ నెల 21వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.