Site icon HashtagU Telugu

Nandipet: బీజేపీకి షాక్.. టీఆర్ఎస్ లోకి నందిపేట బీజేపీ నాయకులు!

Nandipet

Nandipet

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ‌ అరవింద్ లకు భారీ షాక్ తగిలింది. వాళ్లు పర్యటించిన 24 గంటల్లోనే నందిపేట బీజేపీ ఎంపీటీసితో పాటు, బీజేపీ నాయకత్వం టీఆర్ఎస్ లో చేరింది. కల్వకుంట్ల సమక్షంలో, నందిపేట ఎంపీటీసి-2 అరుణ చావన్ గులాబీ కండువా కప్పుకున్నారు.

ఇటీవల ఆర్మూర్ లో పర్యటించిన ఎంపీ అరవింద్ ను స్థానిక పసుపు రైతులు అడ్డుకున్నారు. పసుపు బోర్డు హామీని నెరవేర్చాలంటూ ఎంపీ అరవింద్ ను నిలదీసారు. దీంతో కొందరు అరవింద్ ‌మనుషులు రైతులపై దాడికి ప్రయత్నించారు. అయితే అరవింద్ ను అడ్డుకున్న పసుపు రైతులను ఖలిస్తాన్ తీవ్రవాదులతో పోల్చిన ఎంపీ బండి సంజయ్ ఆర్మూర్ లోని నందిపేటలో పర్యటించారు. అయితే రైతులను ఉగ్రవాదులతో పోల్చి రాజకీయ లబ్ది కోసం తమ గ్రామంలో పర్యటించిన బండి సంజయ్ తీరును గ్రామ బీజేపీ నాయకులు తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ రైతు వ్యతిరేక వైఖరికి నిరసనగా గ్రామ ఎంపీటీసి,ఇతర బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది!