Nanded Train Fire Accident: నాందేడ్‌ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం.. బోగీ దగ్ధం

నాందేడ్‌ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్‌ రైలులో మంటలు చెలరేగాయి.

Published By: HashtagU Telugu Desk
Nanded Train Fire Accident

Nanded Train Fire Accident

Nanded Train Fire Accident: నాందేడ్‌ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్‌ రైల్వే స్టేషన్‌లో పూర్ణ-పర్లి ప్యాసింజర్‌ రైలులో మంటలు చెలరేగాయి. లగేజ్‌ కమ్‌ గ్వార్‌ వ్యాన్‌ కోచ్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది దాదాపు అరగంటపాటు శ్రమించి మంటలను ఆర్పేశారు. ఘటన తర్వాత కోచ్‌ను రైల్వే నుంచి తొలగించారు. రైల్వే స్టేషన్‌లో మరమ్మతుల కోసం ఉంచిన రైలు కోచ్‌లో ఈ మంటలు చెలరేగాయి. ఈ సంఘటన ఉదయం 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనలో బోగీలోని లగేజ్‌, ఫర్నీచర్‌ పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, ఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Also Read: Nellore YSRCP : మాజీ మంత్రి అనిల్‌కు స్థాన‌చ‌ల‌నం.. ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచే పోటీ..?

  Last Updated: 26 Dec 2023, 06:15 PM IST