Nandan Nilekani : పూర్వ విద్యార్ధి 315 కోట్ల విరాళం.. ఐఐటీ బాంబేకి నందన్ నీలేకని చేయూత

Nandan Nilekani : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కీలక నిర్ణయం ప్రకటించారు.  తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి రూ. 315 కోట్లు విరాళంగా ఇచ్చారు. 

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 03:13 PM IST

Nandan Nilekani : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని కీలక నిర్ణయం ప్రకటించారు.  

తాను చదువుకున్న ఐఐటీ బాంబేకి రూ. 315 కోట్లు విరాళంగా ఇచ్చారు. 

గతంలోనూ ఆయన ఈ విద్యా సంస్థకు రూ. 85 కోట్లు విరాళంగా ఇచ్చారు. 

దీంతో ఇప్పటివరకు ఐఐటీ బాంబేకి నీలేకని ఇచ్చిన మొత్తం విరాళం రూ.400 కోట్లకు పెరిగింది.  

ఐఐటీ బాంబేతో నీలేకని(Nandan Nilekani) అనుబంధం ఈనాటిది కాదు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని చదివేందుకు 1973లో ఆయన ఐఐటీ బాంబేలో చేరారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బొంబాయితో తన 50 సంవత్సరాల అనుబంధానికి చిహ్నంగా నందన్ నీలేకని రూ. 315 కోట్ల విరాళాన్ని అందించారు. ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాసిస్ చౌధురి, నందన్ నీలేకని బెంగళూరులో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. “భారతదేశంలో ఒక పూర్వ విద్యార్థి చేసిన అతిపెద్ద విరాళాలలో ఒకటి” గా ఈ డొనేషన్ ను అభివర్ణిస్తున్నారు. అంతకుముందు నీలేకని 2011 నుంచి 2015 వరకు ఐఐటీ బాంబే గవర్నర్ల బోర్డులో పనిచేశాడు.

Also read : Sukesh Chandrashekar: మంచి మనసు చాటుకున్న సుఖేష్ చంద్రశేఖర్.. ఒడిశా ప్రమాద బాధితులకు రూ.10 కోట్ల విరాళం?

“IIT-బాంబే నా జీవితంలో ఒక మూలస్తంభంగా ఉంది. అది నా ప్రయాణానికి పునాది వేసింది. అందుకే దాని భవిష్యత్తు కోసం సహకరిస్తున్నాను” అని నీలేకని పేర్కొన్నారు.  ఐఐటీ-బాంబే  దాని విస్తరణ కోసం రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.4,106 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈవిషయం తెలియడంతో నీలేకని రూ. 315 కోట్ల విరాళాన్ని “యాంకర్ సహకారం”గా ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్ తన లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికలను రూపొందించడానికి ఈ ఫండ్ దోహదపడుతుంది.