Site icon HashtagU Telugu

Tarakaratna : నంద‌మూరి అభిమానుల‌కు బ్యాడ్ న్యూస్‌.. విష‌మంగానే తారకరత్న ఆరోగ్యం

Tarakaratna

Tarakaratna

సినీ నటుడు నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కుప్పంలో గ‌త నెల 26వ తేదీన యువగళం పాదయాత్రలో ఆయ‌న పాల్గొన్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న గుండెపోటుకు గురైయ్యారు. హుటాహుటినా కుప్పం ఆసుప‌త్రికి త‌ర‌లించి అక్క‌డ చికత్స అందించారు. అనంత‌రం మెరుగైన‌ వైద్యం కోసం బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. 22 రోజులుగా తార‌క‌ర‌త్న ఆసుప‌త్రిలోనే ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ముగ్గురు విదేశీ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఆయన పరిస్థితి మెరుగు పడలేదని, అత్యంత విషమంగా ఉన్నట్టు నందమూరి కుటుంబానికి సన్నిహితులు చెపుతున్నారు. బాలకృష్ణతో పాటు మరి కొందరు కుటుంబ సభ్యులు బెంగళూరుకు చేరుకున్నారు. వారితో వైద్యులు చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. రేపు మధ్యాహ్నం తారకరత్నను హైదరాబాద్ కు తరలించే అవకాశాలు ఉన్నట్టు స‌మాచారం