Balakrishna : సీఎం రేవంత్ ను కలిసిన నందమూరి బాలకృష్ణ

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు

  • Written By:
  • Publish Date - May 26, 2024 / 04:00 PM IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ని సినీ నటుడు , హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకున్న బాలకృష్ణ సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. అనంత‌రం ప‌లు విష‌యాల‌పై ఇద్దరు చ‌ర్చించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇటీవలే ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు పూర్తైన విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయని రేవంత్ రెడ్డి.. బాలకృష్ణను అడిగినట్లు సమాచారం. మరోవైపు వీరిద్దరి మధ్య సినిమా సంగతులు కూడా చర్చకు వచ్చినట్లు వినికిడి. ఇక బాలకృష్ణతో పాటు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు, తదితరులు సీఎం ను కలిసిన వారిలో ఉన్నారు.

ఇక బాలకృష్ణ విషయానికి వస్తే.. మొన్నటి వరకు ఏపీలో ఎన్నికలు ఉండటంతో ప్రచారంలో బిజీగా గడిపాడు. ఎలక్షన్స్ అయ్యేంతవరకు ఏపీలోనే ఉన్నారు. ఎన్నికలు అయ్యాక బాలయ్య ..హైదరాబాద్ వచ్చి మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులు చూస్తున్నారు. ఇటీవలే కాజల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా హాజరై సందడి చేసారు. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూట్ కూడా మొదలుపెట్టినట్టు సమాచారం.

Read Also : Burrakatha : టొరంటో లిఫ్ట్‌ ఆఫ్‌ ఫిలిం ఫెస్టివల్‌ కు ‘చిల్కూరి బుర్రకథ’కు ఎంపిక