Site icon HashtagU Telugu

Cheetah Sasha : కునో నేషనల్ పార్క్‎లో నమీబియా ఆడ చిరుత సాషా మృతి

Cheetah Imresizer

Cheetah Imresizer

భారత్ లో చిరుతలకు(Cheetah Sasha) పునరావాసం కల్పించాలన్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. నమీబియాకు చెందిన సాశా ఆడ చిరుత  (Cheetah Sasha)కునో నేషనల్ పార్క్ లో తన ఎన్ క్లోజర్ లో చనిపోయింది. నమీబియా నుంచి మొదట్లో మధ్యప్రదేశ్‌కు వచ్చిన 8 చిరుతల్లో చిరుత సాషా ఒకటి. జనవరి 24న సాషా ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. చిరుత డీహైడ్రేషన్, కిడ్నీ సమస్యతో బాధపడుతోంది. వైద్య బృందం సాషాకు నిరంతరం చికిత్స అందించింది. ఇది ఇంకా అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ. పోస్టుమార్టంలో మరణానికి గల ఖచ్చితమైన కారణం వెల్లడవుతుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

17 సెప్టెంబర్ 2022న, షియోపూర్‌లోని కునో నేషనల్ పార్క్‌లో తన పుట్టినరోజు సందర్భంగా నమీబియా నుండి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. వీటిలో ఐదు ఆడ, మూడు మగ చిరుతలను ఉన్నాయి. ఇటీవల, ఫిబ్రవరి 18న, దక్షిణాఫ్రికా నుండి కునో నేషనల్ పార్క్‌కు మరో 12 చిరుతలను తీసుకువచ్చారు. వాటిని ప్రస్తుతం కునో నేషనల్ పార్కులోని క్వారంటైన్ ఎన్ క్లోజర్ లో పెట్టారు.

కునో నేషనల్ పార్క్‌లో ఇప్పుడు 19 చిరుతలు ఉన్నాయి. గతేడాది సెప్టెంబర్ 17న తన పుట్టినరోజు సందర్భంగా ఎనిమిది చిరుతలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ప్రారంభ కాలంలో ఈ చిరుతలను చిన్న చిన్న క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలో ఉంచేవారు. అక్కడ వారికి పెద్ద జంతువుల మాంసాన్ని తినిపించారు. అప్పుడు ఈ చిరుతలను ఒక్కొక్కటిగా ఒక పెద్ద ఎన్‌క్లోజర్‌లో విడిచిపెట్టారు, అక్కడ చితాల్ వంటి జంతువులు వాటి ఆహారం కోసం విడుదల చేశారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన మరో ఏడు చిరుతలు ఆరోగ్యంగా ఉన్నాయి. వీరిలో ముగ్గురు మగ, ఒక ఆడ చిరుత అడవిలో సంచరిస్తున్నాయి. అదే సమయంలో, దక్షిణాఫ్రికా నుండి తీసుకువచ్చిన 12 చిరుతలు ప్రస్తుతం క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లలో ఉన్నాయి. పూర్తిగా ఆరోగ్యంగా చురుకుగా ఉన్నాయి.