TS RRR Politics: రాజకీయాల్లో కాకరేపుతున్న ‘ఆర్ఆర్ఆర్’ ట్రెండ్

రాజకీయ నాయకులకు సెంటిమెంట్స్ ఎక్కువే. కిందిస్థాయి నాయకుల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు సెంటిమెంట్స్ ను బలంగా నమ్ముతారు.

  • Written By:
  • Updated On - August 8, 2022 / 02:43 PM IST

రాజకీయ నాయకులకు సెంటిమెంట్స్ ఎక్కువే. కిందిస్థాయి నాయకుల నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు సెంటిమెంట్స్ ను బలంగా నమ్ముతారు. అయితే  ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో ‘ఆర్‘ అనే అక్షరం రాజకీయ నాయకులకు వరంగా మారిందని నమ్ముతున్నారు. ఇటీవల విడుదలైన హిట్ మూవీ ’ఆర్ఆర్ఆర్‘ ను రాజకీయాలకు అన్వయించుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మాదిరిగా బీజేపీ లో సైతం ఆర్ఆర్ఆర్ (రఘునందన్, రాజాసింగ్, రాజేందర్) ట్రెండ్ ను కొనసాగిస్తోంది. R అక్షరంతో పేర్లు మొదలయ్యే నాయకులు బీజేపీలో ఎదిగి అందరి దృష్టిని ఆకర్షించడం ‘ఆర్’ సెంటిమెంట్ ను బలంగా నమ్ముతారు కొందరు నేతలు.

ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను ఓడించి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ‘ఆర్‌-నాయకులు’ ఎం. రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ల ఉదంతం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. తాజాగా రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీ చేరి ఎమ్మెల్యేగా గెలిస్తే  ఇక ‘ఆర్’ అనే అక్షరం బీజేపీకి నిజంగా వరంగా మారే  అవకాశాలున్నాయి కూడా. బీజేపీలో ఆర్ అనే అక్షరం హిట్ అవుతుండటంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకున్నట్టు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు తమతో టచ్‌లో ఉన్నారని బీజేపీ నేతలు పదే పదే చెబుతుండడంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. అయితే టీఆర్‌ఎస్‌లో డజను మంది ఎమ్మెల్యేలు ఆర్‌తో మొదలవుతున్నారు. వారిలో రెడ్యా నాయక్, రమేష్ ఆరూరి, రాజయ్య తాటికొండ, రవీంద్రకుమార్ రమావత్, రామన్న జోగు, రాఖా నాయక్, రసమయి బాలకిషన్, రవిశంకర్ సుంకే, రమేష్ చెన్నమనేని, రామ్మోహన్ రెడ్డి చిట్టెం, రోహిత్ రెడ్డి పి. మరియు రేగా కాంత రావు ఉన్నారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల జాబితాలో రాజేశ్వర్ రెడ్డి పల్లా, రాజు శంభీపూర్, డి.రాజేశ్వరరావు, టి.రవీందర్ రావు, ఎల్.రమణ ఉన్నారు.

టీఆర్‌ఎస్‌లో ఆర్-లెటర్ ఉన్న ముగ్గురు ఎంపీలు కూడా ఉన్నారు – జి. రంజిత్ రెడ్డి (లోక్‌సభ), పి. రాములు (లోక్‌సభ), వి. రవిచంద్ర (రాజ్యసభ) ఉన్నారు. విచిత్రమేమిటంటే, ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో ఆర్‌తో ప్రారంభమయ్యే పేరు ఎవరూ లేరు. టీపీసీసీ చీఫ్ ఎ. రేవంత్ రెడ్డి పేరు ఆర్‌తో మొదలవుతుంది. అయితే “రెడ్డి” పదాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే, ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారే. ఆర్‌తో మొదలయ్యే కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖ నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామదొర రాజనరసింహ కూడా ఉన్నారు. అయితే, టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు త్రిబుల్ ఆర్ సెంటిమెంట్ ను కొట్టిపారేస్తున్నాయి. కేటీఆర్, హరీశ్ రావు కూడా ఈ జాబితాలో ఉంటారు. అంటే వాళ్లు కూడా బీజేపీలో చేరతారా అని ఓ నేత ప్రశ్నించారు.