Site icon HashtagU Telugu

Kiran Kumar Reddy: సోనియాతో కిరణ్ కుమార్ రెడ్డి భేటీ!

Kiran Kumar

Kiran Kumar

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీలో కాంగ్రెస్ బలోపేతంపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో పలు కీలక విషయాలు చర్చించినట్టు సమాచారం. అయితే గత కొన్ని రోజులుగా కిరణ్‌కుమార్‌ రెడ్డి ఢిల్లీలో మకాం వేసిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో పార్టీ పదవిలో కొనసాగుతానని కిరణ్‌ అధిష్ఠానానికి చెప్పారని, అయితే ఇపుడున్న పరిస్థితుల్లో ఏపీ పార్టీ పగ్గాలు చేపట్టాలని ఆయనను పార్టీ ఒప్పించినట్లు తెలుస్తోంది. రఘువీరా రెడ్డి కాంగ్రెస్ కు దూరమైన తర్వాత ఏపీలో కాంగ్రెస్ మరింత బలహీనంగా మరింది. కనీసం పవన్ కళ్యాన్ స్థాపించిన జనసేన పార్టీకి పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ కాంగ్రెస్ కు కొత్త ఊపిరి పోసేందుకు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమైంది.

అయితే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఆయన ఉమ్మడి ఏపీ విభజన తర్వాత ఆయన జై సమైక్యాంధ్ర పార్టీని స్థాపించారు. కానీ 2014లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి… ఒక్క సీటు కూడా గెలవలేకపోయారు. ఈ క్రమంలోనే తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే కొంత కాలంగా కిరణ్ కుమార్ రెడ్డి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సోనియాతో భేటీ కావడం చర్చనీయాంశమవుతోంది.