Site icon HashtagU Telugu

Nalgonda : అమెరికాలో కాల్పులు క‌ల‌క‌లం.. న‌ల్గొండ యువ‌కుడు మృతి

USA

USA

అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఆదివారం సాయంత్రం ఓ దుండ‌గుడు కాల్పులు జ‌రిపాడు. ఈ కాల్పుల్లో నల్గొండకు చెందిన నక్కా సాయి చరణ్ (26) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై మృతి చెందాడు. కొడుకు చనిపోయాడని అతని తల్లిదండ్రులకు అమెరికా నుంచి సమాచారం అందింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లోని కాటన్స్‌విల్లే సమీపంలో సాయి చరణ్ కారులో వెళ్తుండగా నల్లజాతీయుడు కాల్చి చంపాడు. సాయి చ‌ర‌ణ్‌ని యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఆడమ్స్ కౌలీ షాక్ ట్రామా సెంటర్‌కు తరలించారు. త‌ర‌లించిన కొద్దిసేపటి తర్వాత చనిపోయినట్లు ప్రకటించారు. అతని తలపై తుపాకీ గాయం కనిపించింది. సాయి చరణ్‌ తన స్నేహితుడిని ఎయిర్‌పోర్టులో దింపేసి కారులో తన నివాసానికి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. సాయి చరణ్ గత రెండేళ్లుగా అమెరికాలోని ఓ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.