మాచర్ల పరిధిలోని గుండ్లపాడు గ్రామంలో హత్యకు గురైన తెలుగుదేశం నేత తోట చంద్రయ్య అంతిమయాత్రలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొని పాడె మోశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం కోసం ప్రాణాలు అర్పించిన చంద్రయ్య త్యాగాన్ని వృధా కానివ్వనని, చంద్రయ్య ఆత్మకు శాంతి కలిగేలా మాచర్లలో తెలుగుదేశం కార్యకర్తలను కాపాడుకుంటానని హామీ ఇచ్చారు. చంద్రయ్య కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని భరోసా ఇచ్చాను. పార్టీ తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటించారు.
Chandrababu Naidu: టీడీపీ నాయకుడి పాడె మోసిన చంద్రబాబు

TDP leader funeral