Site icon HashtagU Telugu

Funeral: స్నేహితుని పాడే మోసిన బాబు

bojjala funeral

bojjala funeral

సీనియర్ నేత బొజ్జల గోపాల కృష్ణారెడ్డి అంత్యక్రియలను ఆయన సొంత గ్రామం ఊరందూరు నిర్వహించారు. అంత్యక్రియలకు పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హజరయ్యారు. బొజ్జల పాడెను చంద్రబాబు మోశారు. తుది వీడ్కోలు పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలి వచ్చారు. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి మండలం, ఊరందూరులో విషాదం అలుముకుంది.
శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌ నుంచి విమానంలో తిరుపతి విమానాశ్రయానికి బొజ్జల భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. రోడ్డు మార్గాన శ్రీకాళహస్తిలోని టీడీపీ కార్యాలయానికి తరలించారు.

గంట పాటు ప్రజల సందర్శనార్థం పార్థీవదేహం ఉంచారు. తర్వాత పట్టణ ప్రధాన వీధుల మీదుగా అంతిమ యాత్ర సాగింది. మధ్యాహ్నం 2.20 గంటలకు ఊరందూరుకు తరలించారు. పార్థివదేహం చూడగానే కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్తులు భోరున విలపించడంతో గ్రామ శోకసంద్రంలో మునిగిపోయింది.
అమెరికా నుంచి అప్పటికే ఇంటికి చేరుకున్న బొజ్జల కుమార్తె పద్మరేఖ బోరున విలపించారు. శ్రీకాళహస్తిలోని శుకబ్రహ్మ ఆశ్రమ పీఠాధిపతి విద్యా స్వరూపానందగిరి స్వామి తో పాటు పార్టీలకు అతీతంగా వివిధ పార్టీల సీనియర్లు నివాళులు అర్పించారు.
బొజ్జల 1989, 94, 98, 2009, 2014లో శ్రీకాళహస్తి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1994-2004 మధ్య చంద్రబాబు కేబినెట్‌లో ఐటీ మంత్రిగా, రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004 ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. మళ్ళీ 2009 ఎన్నికల్లో శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించగా.. చంద్రబాబు కేబినెట్‌లో అటవీశాఖ మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో మాత్రం గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయలేదు. రాజకీయవారసుడిగా కుమారుడు సుధీర్ రెడ్డిని బరిలోకి దింపగా ఓటమి ఎదురైంది.

తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. బొజ్జల స్వస్థలం శ్రీకాళహస్తి సమీపంలోని ఊరందూరు.. ఆయన 1949 ఏప్రిల్ 15వ తేదీన గంగసుబ్బరామిరెడ్డి దంపతులకు జన్మించారు. గగసుబ్బరామిరెడ్డి కూడా శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా పనిచేశారు. శ్రీవెంకటేశ్వర వర్శిటీ నుంచి 1968లో బొజ్జల బీఎస్సీ చేశారు. 1972లో లా పూర్తయ్యాక.. పెళ్లయ్యింది. లా ప్రాక్టీసు కోసం హైదరాబాద్ వచ్చి.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. మచ్చ లేని నేతగా పేరున్న ఆయన చంద్రబాబుకు స్నేహితుడు. పలుమార్లు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.