Skill Development Case : చంద్రబాబును సిట్ అధికారులు ఏ ఏ ప్రశ్నలు అడిగారంటే..

స్కిల్ స్కాం (Skill Development Scam)కు సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు.

  • Written By:
  • Updated On - September 9, 2023 / 09:53 PM IST

టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ స్కాం (Skill Development Scam) కేసు లో శనివారం ఉదయం CID అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నంద్యాల పర్యటన లో ఉన్న బాబు ను శుక్రవారం అర్ధరాత్రి సమయంలో చంద్రబాబు బస చేసిన ప్రాంగణానికి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలతో వెళ్లి శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నాడు. అక్కడి నుండి రోడ్డు మార్గాన కుంచనపల్లి సిట్ ఆఫీస్ కు తీసుకొచ్చారు. సాయంత్రం 07 గంటల నుండి చంద్రబాబు సిట్ అధికారులు విచారిస్తున్నారు.

విచారణ సమయంలో నలుగురు సీనియర్ అడ్వొకేట్లు అక్కడే ఉండాలని చంద్రబాబు కోరారు. అడ్వొకేట్ల సమక్షంలోనే తనను విచారించాలనీ డిమాండ్ చేశారు. అప్పుడే తాను విచారణకు సహకరిస్తాననీ స్పష్టం చేశారు. తన స్టేట్‌మెంట్‌ను ఆ నలుగురు న్యాయవాదుల సమక్షంలోనే రికార్డు చేయాలని లిఖితపూరకంగా దరఖాస్తు చేసుకున్నారు. సీనియర్ లీగల్ కన్సల్టెంట్, మాజీ ఏపీ అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, సీనియర్ కన్సల్టెంట్ పోసాని వెంకటేశ్వర్లు, అడ్వొకేట్ ఎం లక్ష్మీనారాయణ, జవ్వాజి శరత్ చంద్ర సమక్షంలో మాత్రమే తనను విచారించాలని, స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని చంద్రబాబు పట్టుబట్టారు. దీన్ని సీఐడీ అధికారులు తోసిపుచ్చారు.

Read Also : Chandrababu Arrest : లండన్ లో సీఎం జగన్ కు నిరసన సెగ..

ప్రస్తుతం చంద్రబాబు ఫై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. స్కిల్ స్కాంకు (Skill Development Scam) సంబంధించి అధికారులు చంద్రబాబు పాత్రపై ఆయనకు పలు ప్రశ్నలు సంధించారు. దీనికి ఆయన దాదాపు ఒకే రకమైన సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పట్లో అధికారులు రాసిన నోట్ ఫైల్స్ ను కూడా చంద్రబాబుకు సీఐడీ అధికారులు చూపించారు. దీనిపై ఆయన వివరణ ఏంటని అడిగారు. దీనికి చంద్రబాబు తెలీదు, నాకు గుర్తులేదు అనే సమాధానాలే ఇస్తున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా చంద్రబాబు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్, షెల్ కంపెనీల ప్రతినిధుల మధ్య వాట్సాప్ చాట్ ను కూడా సీఐడీ అధికారులు ఆయనకు చూపించారు. చాటింగ్ గురించి ప్రశ్నించగా చంద్రబాబు తెలీదన్నారు. ఓ దశలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మధ్యమధ్యలో సీఐడీ అధికారులు అనుబంధ ప్రశ్నలు సంధించడంతో చంద్రబాబు కాస్త కూల్ అయ్యారని సమాచారం.