Site icon HashtagU Telugu

AP CM jagan : సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన నాయి బ్రాహ్మణ సంఘం నేతలు

Whatsapp Image 2022 08 18 At 5.04.22 Pm Imresizer

Whatsapp Image 2022 08 18 At 5.04.22 Pm Imresizer

నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం కలిశారు. నాయీ బ్రాహ్మణులను, వారి సామాజికవర్గాన్ని కించపరిచే పదాలపై ప్రభుత్వం నిషేదం విధిస్తూ జీవో జారీ చేయడంపై కృతజ్ఞతలు తెలియజేశారు.తమ ఆత్మగౌరవాన్ని కాపాడారని సీఎంకు వివరిస్తూ సంతోషాన్ని వ్యక‍్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన వారిలో నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సిద్దవటం యానాదయ్య, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వల్లూరి కోటేశ్వరరావు, నాయీ బ్రాహ్మణ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జి. రామదాసు, కే. శ్రీదేవి, నందిని ఉన్నారు.