Site icon HashtagU Telugu

Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్యకు అస్వస్థత!

Naga Shaurya

Naga Shaurya

టాలీవుడ్ యువహీరో నాగశౌర్య షూటింగ్ సమయంలో అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తుంది. ఇటీవలే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘కృష్ణ వ్రింద విహారి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నాగశౌర్య.. చాలా రోజుల తరువాత హిట్ ని అందుకున్నాడు. ఈ చిత్రం ఇచ్చిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. గ్యాప్ లేకుండా షూటింగ్స్ లో పాల్గొనడంతో అస్వస్థతకు గురయ్యినట్లు తెలుస్తుంది. కాగా ఈ నటుడి పెళ్లి ఇటీవలే ఖరారైన విషయం తెలిసిందే.

Exit mobile version