నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోని నెలలు గడుస్తోన్న వాళ్ళ విడాకులకు సంబంధించిన కారణాలు తెలుసుకోవాలని ఇప్పటికీ చాలామందికి క్యూరియాసిటీ ఉంది.
ఇద్దరు స్టార్స్ కాబట్టి వాళ్ల వ్యక్తిగత విషయాలు అవసరం లేకపోయినా వాళ్ళ విషయాలను తెలుసుకోవడం చాలామందికి ఇంట్రెస్ట్. అటు సమంత, ఇటుఅక్కినేని ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఏ మీడియా సమావేశానికి హాజరైనా ఈ విషయంపై ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడేమో నాగచైతన్య. అందుకే తన బంగార్రాజు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన విడాకుల విషయంపై తొలిసారిగా చైతు స్పందించారు.
ఇద్దరి కోసం మంచి డిసిషన్ తీసుకున్నామని చైతూ తెలిపారు. ఇప్పుడు ఇక్కడ తాను, అక్కడ తను సంతోషంగా ఉన్నామని, పరిస్థితులను బట్టి ఇద్దరికీ ఇదే బెస్ట్ డిసిషన్ అనిపించిందని చైతన్య తెలిపారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.