Site icon HashtagU Telugu

Mask:ఆ మాస్క్ ని క్లీన్ చేసి 25 సార్లు వాడుకోవ‌చ్చు – అమెరికా సైంటిస్టులు

దేశ వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. దీనితో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కూడా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తుంది. వైర‌స్ త‌న రూపాన్ని మార్చుకుంటూ ప్ర‌జ‌ల‌పై విరుచుకుప‌డుతుంది. కాస్త విరామం ఇచ్చిన‌ట్లే ఇచ్చి మ‌ళ్లీ వైర‌స్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. అయితే క‌రోనా నుంచి రక్ష‌ణ ఇచ్చే ఒకే ఒక ఆయుధం మాస్క్ మాత్ర‌మేన‌ని నిపుణ‌లు అంటున్నారు. చాలామంది ఇప్ప‌టికీ క్లాత్ మాస్క్ లు, స‌ర్జిక‌ల్ మాస్క్ లు మాత్ర‌మే వాడుతున్నారు. వీటివ‌ల్ల‌ వైర‌స్ వ్యాప్తి నియంత్రణ కాద‌ని అమెరికా శాస్త్ర‌వేత్త‌లు అంటున్నారు.

వైర‌స్ వ్యాప్తిని నివారించేందుకు ఎన్ 95 మాస్క్ మాత్ర‌మే వాడాల‌ని వారు సిఫార్సు చేస్తున్నారు. అయితే మార్కెట్ లో ఎన్ 95 మాస్క్ లకు డిమాండ్ అధికంగా ఉంది. దీనికి త‌గ్గ‌ట్టుగానే వీటి రేటు కూడా అధికంగా ఉంది.అందుకే చాలామంది వీటిని కొన‌లేక‌పోతున్నారు. వీటిని వాష్ చేసుకునే అవకాశం లేక‌పోవ‌డం వ‌ల్ల చాలా మంది వీటిని రెండు,మూడు సార్లు వాడి పారేయాల్సి వ‌స్తుంది. అయితే ఎన్ 95 మాస్క్ లను ఎక్కువ‌సార్లు వినియోగించుకోవ‌చ్చని అమెరికా సెంటిస్టులు ఒక కొత్త విధానాన్ని క‌నుగొన్నారు. ఎన్ 95 మాస్క్ ల‌ను 25 సార్లు క్లీన్ చేసి వాడుకోవ‌చ్చని సైంటిస్టులు చెప్తున్నారు. వీటిని క్లీన్ చేయ‌డం వ‌ల్ల మాస్కుల రక్షణ సామర్థ్యం కొద్దిగా కూడా తగ్గదని తెలిపారు. ఎన్​-95 మాస్కులను సాధారణంగా ఆస్పత్రుల్లో హెల్త్ వర్కర్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.

వైరస్ విరుచుకుపడుతున్న నేపథ్యంలో అనేక దేశాల్లో ఎన్ 95 మాస్క‌ల కొరత ఏర్పడింది. దీంతో వైద్య సిబ్బందితో పాటు సామాన్యులు కూడా ఇతర మాస్కులు పెట్టుకోవాల్సి వస్తుంది. బోస్టన్‌లోని బెథ్ ఇజ్రాయెల్ డీకోనెస్ మెడికల్ సెంటర్ సైంటిస్టులు మాస్కులను క్లీన్ చేసేందుకు వేపరైజ్డ్​ హైడ్రోజన్ పెరాక్సైడ్​ను (వీపీహెచ్‌) చేస్తున్నారు. ఇది సాధార‌ణ క్రిమిసంహార‌క ర‌సాయ‌నం.. దీని సాయంతో ఎన్​-95 మాస్కులను క్లీన్ చేయవచ్చిన శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ విధానంలో 25 సార్లు క్లీన్ చేసిన‌ప్ప‌టికీ మాస్కు సామర్థ్యం ఏ మాత్రం తగ్గదేలేదని తమ పరిశోధనలో వెల్లడైనట్లు తెలిపారు. కాబ‌ట్టి ఎన్ 95 మాస్క్ ఒక్క‌సారి కొంటే క్లీన్ చేసి 25 సార్లు వ‌ర‌కు వాడుకోవ‌చ్చు. డిమాండ్ త‌గ్గ‌ట్టుగానే ఎన్ 95 మాస్క్ లు కూడా మార్కెట్ లో త‌క్కువ ధ‌ర‌కు అందుబాటులో ఉంటే అంద‌రు వీటిని ఉప‌యోగిస్తార‌ని వైద్య నిపుణులు అంటున్నారు.