Human Brain: చనిపోయే ముందు మన మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?

మానవ మెదడుకు సంబంధించి శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని చాలా రహస్య

  • Written By:
  • Publish Date - May 2, 2023 / 08:35 PM IST

మానవ మెదడుకు సంబంధించి శాస్త్రవేత్తలు కొన్ని ఏళ్ల తరబడి పరిశోధనలు జరుగుతూనే ఉన్నారు. అయినప్పటికీ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని చాలా రహస్యాలు ఇంకా మెదడు విషయంలో దాగి ఉన్నాయని తెలుస్తోంది. చాలా సమాచారం అసంపూర్తిగా మిగులుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే మెదడుపై పరిశోధనలు జరిపిన శాస్త్రవేత్తలు మనిషి చనిపోతున్న సమయంలో మెదడు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్న విషయంపై తాజాగా అమెరికాలోని మిచిగాన్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

మరణానికి చేరువలో కోమాలో ఉన్న నలుగురు వ్యక్తుల బ్రెయిన్ లపై పరిశోధకులు అధ్యయనం జరిపారు. అయితే మరణించడానికి ముందు మానవ మెదడు యాక్టివిటీ పెరిగినట్లు పరిశోధకులు గుర్తించినట్లు వెల్లడించారు. చనిపోతున్న సమయంలో మనిషి మెదడు పనితీరు మిస్టరీగా ఉందని వారు వెల్లడించారు. చనిపోతున్న వారి బ్రెయిన్ పనితీరును ఈసీజీ ఈఈజీ సంకేతాలతో విశ్లేషించారు. గత కొన్ని సంవత్సరాలుగా మనిషి చనిపోయే ముందు మానవ మెదడు ఏ విధంగా ప్రవర్తిస్తుంది అన్న విషయంపై శాస్త్రవేత్తలు అధ్యయనాలు జరుపుతూనే ఉన్నారు. మనిషి చనిపోయే ముందు గామా వేవ్స్ పెరిగినట్లు తేలిందట.

వాటిని ఎక్కువగా గుండె విఫలం అయిన సందర్భంలో చూస్తూ ఉంటాం అని పరిశోధకులు వెల్లడించారు. వెంటిలేటర్ సపోర్టు తొలగించిన తర్వాత ఇద్దరిలో స్పృహతో సంబంధం ఉన్న గామా వేవ్ యాక్టివిటీ లో పెరుగుదలను గమనించారట. మెదడులోని హాట్ జోన్ అయినా కలలు కనే ప్రాంతం స్పృహతో సంబంధం ఉండే ప్రాంతంలో ఈ చర్యలను పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనం మనిషి చనిపోయే ముందు మెదడు మరింత యాక్టివేట్ గా పనిచేస్తుందని వారు గుర్తించారు.