Site icon HashtagU Telugu

BJP Yatra: రాముడి విగ్రహంపై ముస్లింలు పూలవర్షం..హిందూ ఏక్తా యాత్రలో అరుదైన దృశ్యం!!

Bjp Yatra

Bjp Yatra

మతకలహాలతో దేశంలో చిచ్చురాజేసుకుంటుంటే…మరోవైపు మతసామరస్య వెల్లివిరిసింది. మతాలు వేరైనా మనమంతా ఒక్కటేనంటూ మరోసారి నిరూపించారు. తమ మత ఆచారాలు, సంస్క్రతి సంప్రదాయాలను గౌరవిస్తూ…ఇతర మతాల పట్ల కూడా ఆదరభిమానాలు చూపించానల్న సందేశం ఇచ్చారు. కరీంనగర్ జిల్లాలో జరిగిన హిందూ ఏక్తా యాత్రలో అరుదైన దృశ్యం అందర్నీ ఆకట్టుకుంది.

రాముడి విగ్రహంపై ముస్లింలు పూలవర్షం కురిపించారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఏక్తా యాత్ర పేరుతో హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. ఈయాత్రలో రాముడు, హనుమాన్ విగ్రహాలను ప్రధాన రహదారుల గుండా ఊరేగిస్తూ…రాజీవ్ చౌక్ వద్దకు చేరుకోగానే..ముస్లింలు బిల్డింగ్ పై నుంచి రాముడి విగ్రహంపై పూలను వెదజల్లారు. ఈ దృశ్యం మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది.

గతంలోనూ దేశంలోని పలుచోట్ల గణేశ్ నిమజ్జన శోభయాత్రతోపాటు..పలు హిందువుల పండగల సందర్భంగా ముస్లీంలు సేవా కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. హైదరాబద్ లో ప్రతి ఏడాది జరిగే గణేశ్ శోభయాత్ర సందర్భంగా పాతబస్తితోపాటు మరికొన్ని ప్రాంతాల్లో హిందువులకు ముస్లింలు మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందిస్తున్న సందర్భాలు ఎన్నో చూసాం.