Telangana: 4% కోటా అమలుపై సీఎంని అభ్యర్ధించిన ముస్లిం నేతలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మైనార్టీ ప్రజాప్రతినిధులు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు.

Telangana: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు మైనార్టీ ప్రజాప్రతినిధులు. విద్య, ఉద్యోగాల్లో మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మైనార్టీ ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. 2024-2025 ఆర్థిక సంవత్సరం నూతన బడ్జెట్‌లో మైనారిటీ విద్యాసంస్థల అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో ముస్లిం నాయకులు పాల్గొన్నారు. 4% కోటా అమలు చేయాలని సీఎంను కోరారు ముస్లిం నేతలు. వక్ఫ్ భూములకు రక్షణ కల్పించాలని, మత సామరస్యాన్ని అదుపులో ఉంచి శాంతిభద్రతలు కాపాడాలని కోరారు. తమ డిమాండ్లు, వినతులపై సానుకూలంగా స్పందించినందుకు సీఎంకు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Telangana: ప్రభుత్వ సలహాదారుగా షబ్బీర్ అలీ బాధ్యతలు