Site icon HashtagU Telugu

MM Keeravani : సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్ఎమ్ కీర‌వాణికి ప‌ద్మ‌శ్రీ అవార్డు

Keeravani

Keeravani

ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఎమ్ఎమ్ కీర‌వాణి (MM Keeravani) ప‌ద్మ‌శ్రీ అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం పద్మశ్రీ అవార్డుల‌ను రాష్ట్రపతి భవన్‌లో ప్ర‌ధానం చేశారు. ఈ సంద‌ర్భంగా వివిధ రంగాలలో విశేష కృషి చేసినందుకు భారత రాష్ట్రపతి భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని ప్రదానం చేస్తారు. సంగీత పరిశ్రమకు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా బుధవారం నాడు ఎంఎం కీరవాణికి ఈ అవార్డు లభించింది. MM Keeravani ఆంధ్రప్రదేశ్‌లోని కొవ్వూరులో జన్మించిన తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టారు. సంగీత దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించారు. ఇండ‌స్ట్రీలో సంగీత ద‌ర్శ‌కుడిగా కీర‌వాణి మంచి పేరు తెచ్చుకున్నారు.ఇటీవల RRR చిత్రంలో నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డును కీర‌వాణి అందుకున్నారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీకి ఆస్కార్ అవార్డు లభించింది. కార్యక్రమంలోపాట కూడా ప్రదర్శించబడింది.