Site icon HashtagU Telugu

Mani Sharma Bereaved: సంగీత దర్శకుడు మణిశర్మకు మాతృవియోగం

mani sharma mother

mani sharma mother

ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తల్లి యనమండ్ర సరస్వతి (88) తీవ్ర అనారోగ్యంతో ఈ రోజు కన్నుమూశారు. సరస్వతి కొన్నాళ్లుగా వృద్ధాప్య సంబంధ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స పొందుతున్నప్పటికీ, పరిస్థితి విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. ఇప్పటికే చిత్ర పరిశ్రమ పెద్ద అనదగ్గ కృష్ణంరాజు మృతితో తల్లడిల్లుతున్న తరుణంలో టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది.

మణిశర్మ తండ్రి వైఎన్ శర్మ నాలుగేళ్ల కిందటే మరణించారు. ఇప్పుడు తల్లి కూడా మరణించడంతో మణిశర్మ శోకసంద్రంలో మునిగిపోయారు. మచిలీపట్నంలో జన్మించిన మణిశర్మ బాల్యం నుంచే సంగీతం నేర్చుకోవడానికి తల్లి సరస్వతి ప్రోత్సాహం ఎంతో ఉంది. తల్లిని కోల్పోయిన మణిశర్మకు టాలీవుడ్ ప్రముఖులు పలువురు సంతాపం తెలియజేస్తున్నారు.