Site icon HashtagU Telugu

Musi, Esa Rivers: మూసీ, ఈసా నదులపై 15 వంతెనలు!

Musi

Musi

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనుంది. హైదరాబాద్ ను మరింత డెవలప్ మెంట్ చేసేందుకు అద్భుతమైన కార్యచరణను రూపొందించనుంది. ఈ మేరకు మూసీ, ఈసా నదులపై 15 వంతెనల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం రూ.545 కోట్లతో పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జిలు ప్రదేశాన్ని అలంకరించడంతో పాటు నీటి వనరుల దగ్గర కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. మూసీ వెంబడి వంతెనలు ఉన్నప్పటికీ, అభివృద్ధి కారణంగా ట్రాఫిక్ భారాన్ని మోయలేకపోతున్నాయి. దీన్ని అనుసరించి, మెరుగైన కనెక్టివిటీని నిర్ధారించడానికి మూసీపై మరిన్ని వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. తద్వారా పరిపాలనా అనుమతి లభించింది.

పెరుగుతున్న జనాభా, రహదారి నెట్‌వర్క్,  ట్రాఫిక్ సాంద్రతను దృష్టిలో ఉంచుకుని, అదనపు వంతెనలను నిర్మించగల ప్రదేశాలను అంచనా వేయడానికి వివరణాత్మక ట్రాఫిక్ అధ్యయనం జరిగింది. వంతెనల ముఖభాగం అభివృద్ధి, ఎలివేషన్ , గేట్‌వేల కోసం నిర్మాణ రూపకల్పన పోటీ కూడా ముందుగా జరిగింది. మూసీ, ఈసా నదులపై 15 వంతెనలు ఏర్పాటైతే భాగ్యనగరం మరింత అట్రాక్షన్ లా మారనుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ పై ఫ్లోటింగ్ బ్రిడ్జి అందుబాటులోకి రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ నిర్ణయంతో హైదరాబాద్ సుందరంగా దర్శనమివ్వబోతోంది.

Exit mobile version