సాధారణంగా బాతులు, కోళ్లకు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. అంటే బాతులు కోడి ఆకారంలో ఉండి అచ్చం కోడి మాదిరిగానే ముఖ భాగం ఉంటుంది. దాని ముక్కు శరీరం భాగం కోడి లాగే ఉంటుంది. అయితే కోడి మాదిరిగా కనిపించి కోడి లక్షణాలు కనిపించే బాతులను ముస్కోవి బాతులు అంటారు. మరి ఈ బాతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ ముస్కోవి బాతులు ఎక్కువగా మెక్సికో మధ్య దక్షిణ అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఉష్ణ మండల ప్రాంతాలలో నివసిస్తూ ఉంటాయి. ఇవి నలుపు,తెలుపు రంగులలో ఉంటాయి.
మగ ముస్కోవి బాతుల ఈకలు నిగనిగిలాడుతూ రంగురంగులుగా ఉంటాయి. ఇక ఆడ బాతుల రెక్కలు దట్టంగా మందంగా ఉంటాయి. ఆడబాతులతో పోలిస్తే మగ బాతులు కొంచెం పెద్దవిగా ఉంటాయి. ఇవి ఎక్కువగా న్యూజిలాండ్,ఆస్ట్రేలియా, ఐరోపా లాంటి కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా తడి అడవులు,చిత్తడి నేలలు,సరస్సులు నదులు ప్రవాహాల సమీపంలో గడ్డి భూములలో నివసిస్తాయి. ఈ బాతులు వలస వెళ్లవు.
పగటిపూట ఎంతో చురుకుగా ఉంటాయి. రాత్రిపూట ఈ పక్షులు తరచూ చెట్లపై విహరిస్తూ ఉంటాయి. అలాగే ఇవి నేలపై మేస్తూ లోతులే నీటిలో ఈత కొట్టడం ద్వారా ఆహారం కోసం రోజులు గడుపుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా జంటలుగా లేదా చిన్న చిన్న సమూహాలతో కనిపిస్తూ ఉంటాయి. మగ బాతులు తరచుగా ఆహారం కోసం మిగతా వాటితో పోటీ పడతాయి. ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకోవడం కోసం తోకలను ఊపుతాయి. అలాగే తలను పైకి లేపి కిందికి దించుతూ అరుస్తూ ఉంటాయి.