Site icon HashtagU Telugu

Murder : విజ‌య‌వాడ‌లో దారుణం.. న‌డిరోడ్డుపై మ‌హిళ హ‌త్య‌

Murder

Murder

విజ‌యవాడ‌లో దారుణం చోటుచేసుకుంది. న‌గ‌రంలోని చ‌నుమోలు వెంక‌ట్రావు ఫ్లైఓవ‌ర్‌పై రాత్రి 9 గంట‌ల స‌మ‌యంలో ఓ మ‌హిళ‌ను వ్య‌క్తి దారుణంగా న‌రికి చంపాడు. మృతురాలు నాగ‌మ‌ణిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు రాజేష్ మృతురాలి అల్లుడు.. త‌నకు విడాకులు ఇవ్వాలని భార్య‌ను నాగ‌మ‌ణి ప్రోత్స‌హించినందుకు ఈ ఘాతుకానికి ఒడిగ‌ట్టిన‌ట్లు పోలీసులు తెలిపారు. విడాకుల పిటిషన్ వేయమని తన కుమార్తెను ప్రోత్సహించినందుకు నాగమణిపై రాజేష్ పగ పెంచుకున్నాడు. భార్యతో విడిపోవడానికి అత్తమామలే కారణమని భావించిన అతడు ఆమెను కొబ్బరికాయ కొట్టే కొడవలితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో నాగమణి అక్కడికక్కడే మృతి చెందిందని, రాజేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఇంటింటికీ బట్టలు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు. పోలీసులు నిందితుడు రాజేష్‌పై ఐసీసీ 302 సెక్ష‌న్ కింద కేసు నమోదు చేశారు.