Site icon HashtagU Telugu

Murder : హైద‌రాబాద్‌లో దారుణం.. 25 ఏళ్ల యువ‌కుడిని హ‌త్య చేసిన దుండ‌గులు

Murder

Murder

హైదరాబాద్ లంగర్ హౌజ్‌లో దారుణం చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి 25 ఏళ్ల యువకుడిని కొందరు వ్యక్తులు హత్య చేశారు. మృతుడు షేక్ సలీంగా పోలీసులు గుర్తించారు. షేక్ స‌లీం వెళుతుండగా 4 నుంచి 5 మంది వ్యక్తులు ఆపి మారణాయుధాలతో దాడి చేసి హత్య చేశారని వెస్ట్ జోన్ డీసీపీ జోయెల్ డేవిస్ తెలిపారు. హత్య చేసిన అనంతరం దుండగులు అక్కడి నుంచి పారిపోయారని.. స్థానికులు ఇచ్చిన స‌మాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆసిఫ్‌నగర్ ఏసీపీ శివ మారుతి ఆధ్వర్యంలో ఐదు బృందాలు ఏర్పాటు చేసి దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు జోయల్ డేవిస్ తెలిపారు.