Site icon HashtagU Telugu

Murder : రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య‌ను హ‌త్య చేసిన భ‌ర్త‌..ఆపై..?

Delhi Murder

Delhi Murder

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటుచేసుకుంది. భార్యను హత్య చేసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలో శనివారం ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి ఆత్మహత్యకు పాల్పడిన‌ట్లు పోలీసులు తెలిపారు. వారి మృతదేహాలను ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌ను వెల్ల‌డిస్తామ‌ని పోలీసులు తెలిపారు.