Munugode : మునుగోడులో కోమటిరెడ్డిపై పోస్ట‌ర్ల క‌ల‌క‌లం.. కాంట్రాక్ట్‌పే అంటూ..!

మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై పోస్ట‌ర్లు వెలిశాయి. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని..

Published By: HashtagU Telugu Desk
Munugode Imresizer

Munugode Imresizer

మునుగోడులో బీజేపీ అభ్య‌ర్థి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డిపై పోస్ట‌ర్లు వెలిశాయి. మంగళవారం మునుగోడు నియోజకవర్గంలోని చండూరులో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఏర్పాట్లు చేసిన పోస్టర్లు దుమారం రేపుతోన్నాయి. ఫోనే పే తరహాలో కాంట్రాక్ట్ పే అంటూ దర్శనమిస్తున్న పోస్టర్లు స్థానిక ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. చండూరులో రాత్రికి రాత్రి గోడలకు వేలాది పోస్టర్లను కొంతమంది అతికించారు. రూ.18 వేల కాంట్రాక్టు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికే కేటాయించడం జరిగిందంటూ
BJP18THOUSANDCRORES అనే ట్రాన్సక్షన్ ఐడీని ఫోన్ పే తరహాలో పోస్టర్ లో ప్రింట్ చేశారు. అయితే వీటిని బీజేపీ కార్య‌క‌ర్త‌లు చించివేశారు. కాంట్రాక్టుల కోసమే రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మారారంటూ ఇటు టీఆర్ఎస్‌, కాంగ్రెస్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆరోప‌ణ‌లు చేశాయి. అయితే తాజాగా ఆయ‌న‌పై పోస్ట‌ర్ల రూపంలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

  Last Updated: 11 Oct 2022, 12:05 PM IST