Site icon HashtagU Telugu

Hyderabad: మున్నవార్ ఫారూఖీ షో వాయిదా..

Template (30) Copy

Template (30) Copy

ప్రముఖ స్టాండప్ కమెడియన్ మున్నవార్ ఫారూఖీ జనవరి 9న ‘దండో’ షో నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కోవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా షో ను వాయిదా వేస్తున్నట్టు మున్నవార్ ఫారూఖీ ప్రకటించారు. నగరంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో షోను వాయిదా వేసుకోవాలని పోలీసులు కోరినట్టు మున్నవార్ చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో కోవిడ్ పరిస్థితి ద్రుష్టిలో ఉంచుకొని షో తేదీని ప్రకటిస్తామని నిర్వాహకులు వెల్లడించారు.