Site icon HashtagU Telugu

Mumbai Bomb Threat: 6 ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు.. హైఅలర్ట్‌లో ముంబై..!

Mumbai Bomb Threat

Safeimagekit Resized Img (3) 11zon

Mumbai Bomb Threat: మహారాష్ట్ర రాజధాని ముంబై (Mumbai Bomb Threat)లో శుక్రవారం మరోసారి భయాందోళనలు నెలకొన్నాయి. ముంబై పోలీసులకు బెదిరింపు సందేశం వచ్చింది. గుర్తుతెలియని వ్యక్తి 6 వేర్వేరు ప్రాంతాల్లో బాంబులున్నట్లు సమాచారం అందించిన‌ట్లు తెలుస్తోంది. దీనిపై ముంబై పోలీసులు సహా దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. రద్దీగా ఉండే ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లను పెంచారు. అలాగే కాల్ చేసిన వ్యక్తి గురించి కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు.

బెదిరింపు సందేశానికి సంబంధించిన సమాచారాన్ని ముంబై పోలీసులు పంచుకున్నారు. ముంబై ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తుతెలియని వ్యక్తి బెదిరింపు సందేశం ఇచ్చాడని తెలిపారు. ముంబై అంతటా బాంబులు పెట్టినట్లు ఆ వ్యక్తి చెప్పాడు. మొత్తం 6 చోట్ల బాంబులు అమర్చిన‌ట్లు చెప్పాడ‌ని పేర్కొన్నారు. సందేశం అందిన వెంటనే ముంబై పోలీసులు, ఇతర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. అలాగే బాంబు గురించి సమాచారం ఇచ్చిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: Paytm – RBI : పేటీఎంపై ఆర్​బీఐ ఆంక్షలు.. ఆగిపోయే సేవలు, కొనసాగే సేవలివీ

రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచారు

బెదిరింపు సందేశాల తర్వాత బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి రద్దీ ప్రదేశాలలో ముంబై పోలీసులు నిఘా పెంచారు. అంతేకాకుండా అనుమానాస్పద వ్యక్తులను కూడా విచారిస్తున్నారు. బాంబ్ స్క్వాడ్ బృందం కూడా పలు చోట్ల సోదాలు చేస్తోంది. అయితే పోలీసులకు ఎక్కడా ఇంకా ఏమీ దొరకలేదు.

గతంలో కూడా బెదిరింపు నకిలీ సందేశాలు వచ్చాయి

ముంబై ట్రాఫిక్ పోలీసుల హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్‌కు బెదిరింపు సందేశం వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో పోలీసులు ఆ గుర్తు తెలియని వ్యక్తిపై ఫిర్యాదు చేశారు. ఇంతకు ముందు కూడా ముంబై పోలీసులకు చాలాసార్లు బెదిరింపు నకిలీ సందేశాలు వచ్చాయని మ‌న‌కు తెలిసిందే. న్యూ ఇయర్ రాకముందే ముంబైని పేల్చేస్తామనే బెదిరింపు వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join